​వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి..

ఘనంగా నివాళులర్పించిన రజక సంఘం

​వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి..

మల్యాల, : భూమి కోసం, భుక్తి కోసం దొరల గడీల అహంకారాన్ని ఎదిరించి, నిరుపేదల హక్కుల కోసం పోరాడిన తెలంగాణ సాయుధ పోరాట వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతిని పురస్కరించుకుని మల్యాల మండల కేంద్రంలో ఆమెకు ఘనంగా నివాళులు అర్పించారు. ​ఈ సందర్భంగా మండల కేంద్రంలోని చాకలి ఐలమ్మ విగ్రహానికి రజక సంఘం నాయకులు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ.. వెట్టిచాకిరీ విముక్తి కోసం, బడుగు బలహీన వర్గాల ఆత్మగౌరవం కోసం ప్రాణాలకు తెగించి పోరాడిన ధీరవనిత చాకలి ఐలమ్మ అని కొనియాడారు. ఆమె చూపిన పోరాట బాట, ఆశయాలు ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయమని, ఆమె స్ఫూర్తితో హక్కుల సాధనకై ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం అధ్యక్షుడు పోచంపల్లి లక్ష్మీనారాయణ, నాయకులు మంద రమేష్, కనగర్తి నరేష్, కోరేపు భూమేశ్వర్, జగిత్యాల లక్ష్మీనర్సయ్య, కనగర్తి అంజయ్య, మల్లయ్య, కనగర్తి బాలరాజ్, కోరేపు వెంకటేష్, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

Views: 22

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్
నాగర్ కర్నూల్  :నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం కోడేరు మండలం బావాయిపల్లి గ్రామంలో జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ గురువారం ఆకస్మిక పర్యటన చేపట్టారు.గ్రామంలోని...
చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శం
అచ్చంపేటలో ఘనంగా చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి వేడుకలు
అచ్చంపేటలో ఘనంగా చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి వేడుకలు
బడికి వెళ్దాం.. భవిష్యత్తును మార్చుకుందాం!
బిజినపల్లిలో ఘనంగా తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ 41వ వర్ధంతి
ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు