బీఆర్‌ఎస్ నేతల ముందస్తు అరెస్టులపై కర్రె వెంకటయ్య ఫైర్
అరెస్టులతో అణచివేత.. ఇదేం పాలన?
యాదగిరిగుట్ట: అసెంబ్లీ ముట్టడి నేపథ్యంలో యాదగిరిగుట్ట మండలానికి చెందిన బీఆర్‌ఎస్ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ అరెస్టులను బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు కర్రె వెంకటయ్య తీవ్రంగా ఖండించారు. ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్న నాయకులను అరెస్టులతో అడ్డుకోవడం కాంగ్రెస్ ప్రభుత్వ అణచివేత వైఖరికి నిదర్శనమన్నారు.మహిళలు అని కూడా చూడకుండా పోలీసులతో అసెంబ్లీ వద్ద గెంటివేయించడం ప్రభుత్వ వికృత చర్యలకు అద్దం పడుతోందని మండిపడ్డారు. ప్రజా సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించే అవకాశం లేకుండా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలందరినీ సమావేశాలనుంచి సస్పెండ్ చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు.“కాంగ్రెస్ అరాచక పాలన ఇంకెన్నాళ్లు?”అని ప్రశ్నించిన వెంకటయ్య.. రాష్ట్ర ప్రజలు ప్రభుత్వ తీరును నిశితంగా గమనిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ పాలనకు చరమగీతం పాడే రోజు ఎంతో దూరంలో లేదని హెచ్చరించారు.అరెస్ట్ అయిన వారిలో రామాజీపేట సర్పంచ్ దేవేందర్,పెద్ద కందుకూర్ సర్పంచ్ గుండ్లపల్లి వెంకటేష్ గౌడ్, పట్టణ సెక్రెటరీ జనరల్ పాపట్ల నరహరి,శ్రీధర్,వాసం రమేష్, సతీష్ బట్, తోటకూరి మల్లేష్, రాజేష్ తదితరులు ఉన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


