పావని గౌడ్‌పై పోలీసులకు ఫిర్యాదు
దౌల్తాబాద్,సిద్దిపేట: దళితులను అవమానించేలా వ్యవహరించిన బీఆర్‌ఎస్ నాయకురాలు పావని గౌడ్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ నిరోధక చట్టం 1989 ప్రకారం కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కోరుతూ దౌల్తాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మండల కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు బోర్రోళ్ళ స్వామి ఈ ఫిర్యాదును అందజేశారు. ఎమ్మెల్సీ తాత మధు వ్యాఖ్యలకు నిరసనగా దళిత నాయకులు కేసీఆర్ ఫామ్‌హౌస్ ముట్టడికి వెళ్లిన సందర్భంగా.. దళితుల రాకతో ప్రాంతం అపవిత్రమైందనే భావనతో పావని గౌడ్ రోడ్లను పసుపు, పాలతో శుద్ధి చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి, వీడియోలు, ఫొటోలు, సోషల్ మీడియా పోస్టులను పరిశీలించి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్వామి కోరారు.ఈఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మద్దెల స్వామి,జిల్లా ఉపాధ్యక్షుడు పడాల రాములు,మండల అధ్యక్షుడు జనగామ మల్లారెడ్డి,జిల్లా ప్రధాన కార్యదర్శి గణేష్ పంచమి,తిర్మలాపూర్ సర్పంచ్ బండారు లాలూ, సీనియర్ నాయకులు కర్నాల శ్రీనివాసరావు,ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు రాజేష్,నాయకులు బ్యాగరి రాజు,ఆంజనేయులు గౌడ్, తలారి నర్సింలు,యాదగిరి తదితరులున్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


