ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలపై అసెంబ్లీలో చర్చించాలి 

ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలపై అసెంబ్లీలో చర్చించాలి 

హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలపై తెలంగాణ శాసనసభలో చర్చించేందుకు వాయిదా తీర్మానం ప్రతిపాదించాలని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కోరారు. ఈ మేరకు తెలంగాణ శాసనసభ కార్యదర్శికి ఆయన సెప్టెంబర్ 10న నోటీసు సమర్పించారు.రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల వ్యవస్థను రద్దు చేసి, ప్రభుత్వమే నేరుగా వారికి వేతనాలు చెల్లించేలా ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఆయన ప్రతిపాదించారు. అలాగే వివిధ శాఖల్లో తొలగించిన కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరారు.ఉద్యోగుల సమస్యలు, వారి భవిష్యత్ భద్రత, ప్రభుత్వ శాఖల్లో సేవలు అందిస్తున్న సిబ్బందికి న్యాయం చేయాల్సిన అవసరంపై సభలో చర్చ జరపాలని కూనంనేని కోరారు. ఈ అంశాన్ని అత్యవసర ప్రజాప్రయోజన విషయంగా పరిగణించి, శాసనసభా కార్యక్రమాలను వాయిదా వేసి చర్చించేందుకు అనుమతించాలని ఆయన తన నోటీసులో విజ్ఞప్తి చేశారు. కాగా, కూనంనేని సాంబశివరావు కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. 
 ప్రధాన డిమాండ్లు: 
ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేయాలి
ప్రభుత్వమే నేరుగా వేతనాలు చెల్లించాలి
ఉద్యోగుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి
విద్యాసంస్థలలో చేస్తున్నా ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు  12 నేలాల చెల్లించాలి
తొలగించిన కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలి
సమస్యలపై శాసనసభలో సమగ్ర చర్చ జరపాలి

Views: 8

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్
నాగర్ కర్నూల్  :నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం కోడేరు మండలం బావాయిపల్లి గ్రామంలో జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ గురువారం ఆకస్మిక పర్యటన చేపట్టారు.గ్రామంలోని...
చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శం
అచ్చంపేటలో ఘనంగా చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి వేడుకలు
అచ్చంపేటలో ఘనంగా చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి వేడుకలు
బడికి వెళ్దాం.. భవిష్యత్తును మార్చుకుందాం!
బిజినపల్లిలో ఘనంగా తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ 41వ వర్ధంతి
ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు