ఐటీడీఏ నూతన భవనం నిర్మించాలి
- మన్యసీమ పరిరక్షణ సమితి డోలు దెబ్బ రాష్ట్ర అధ్యక్షులు గొప్ప వీరయ్య
- మంగపేట/ ఏటూరు నాగారం సెప్టెంబర్ 09 విజన్ ఆంధ్ర రిపోర్టర్
ములుగు జిల్లా షెడ్యూల్ ఏరియా ఏజెన్సీ ప్రాంతం ఏటూరు నాగారం లో ఆదివాసుల అభివృద్ధి ఆదివాసిల సమస్యలు పరిష్కరించుటకు వారి జీవోలు గిరిజన చట్టాలు ఆర్టికల్స్ అమలుకై 1974 లో ఐ టి డి ఏ కార్యాలయమును మొట్టమొదట వరంగల్ లో స్థాపించబడింది ఇట్టి ఐ టి డి ఏ కార్యాలయం 5వ షెడ్యూల్ భూభాగంలోనే ఏజెన్సీ ప్రాంతంలో ఉండాలని అప్పటి పిఓ సత్యనారాయణ 1985 లో ఏటూరు నాగారం బ్లాక్ సమితి పరిధిలోని ఆకులవారి ఘనపురం గ్రామంలో ఏజెన్సీ ప్రాంతంలో ఉండాలని వరంగల్ నుండి ఏటూరునాగారం మండల పరిధి ఆకుల వారి ఘనపురానికి మార్చబడింది ఇట్టి కార్యాలయమును ఏక్కెల గ్రామ శివారులో ఆర్టికల్చర్ షేరికల్చర్ ప్రభుత్వ శాఖలకు కేటాయించబడిన భూమి స్థలములో మంజూరైన 16 కోట్ల రూపాయలతో నూతన ఐటీడీఏ భవనం నిర్మించుటకు ప్రభుత్వం చేస్తున్న ఆలోచనలను మన్యసీమ పరిరక్షణ సమితి డోలు దెబ్బ ఖండిస్తుంది ఇప్పటికైనా మంత్రి సీతక్క గిరిజన ఎమ్మెల్యేలు గిరిజన ఎంపీలు జిల్లా కలెక్టర్ ఐటిడిఏ పిఓ గిరిజనులకు మారుమూల ప్రాంతం దూరంగా మార్చాలనే ప్రయత్నం మానుకోవాలి ఎందుకంటే ఇంత రోడ్డు దగ్గర ఉంటేనే ఆదివాసులు సమస్యలు చెప్పుకోవడానికి రావడం లేదు మరి మారుమూల ప్రాంతాములో ఐటిడిఏ కట్టుతే అక్కడికి రవాణా సౌకర్యం ఉండదు మా ఆదివాసులు ఐటిడిఏ ఎక్కడ ఉన్నదో కూడా తెలియదు కాబట్టి మాకు మా ఆదివాసి ప్రజలకి అందుబాటులో ఉండాలంటే ఆకుల వారి ఘనపురం గ్రామ శివారు సర్వే నెంబర్ 209లో 125 /26 ఎకరాల గుంటల ప్రభుత్వ భూమి ఉన్నది అందులోనే 22.6 గుంటలు చెరువు శిఖం భూమి పొగ మిగిలిన 103-20 ఎకరాల గుంటల ప్రభుత్వ భూమి కలదు ప్రభుత్వ కార్యాలయాలు ఐటిడిఏ కార్యాలయాలు ప్రజలకు అందుబాటులో రోడ్డు పక్కన ఉండాలి కానీ మారుమూల ప్రాంతమైన ఎక్కేలా శివారులో ఆర్టికల్చర్ షేర్ కల్చర్ ప్రభుత్వ శాఖలకు కేటాయించబడిన స్థలంలో భావన నిర్మాణాన్ని చేయాలనే ప్రయత్నం మానుకోవాలి సర్వే నంబర్ 209 ప్రభుత్వ భూమిలో 10 ఎకరాలలో మంజూరైన 16 కోట్లతో నూతన ఐటీడీఏ భవనాన్ని నిర్మించాలని మన్య సీమ పరిరక్షణ సమితి డోలు దెబ్బ డిమాండ్ గతంలో కూడా చందులాల్ మంత్రిగా ఉన్నప్పుడు ఎక్కేలా శివార్లు కట్టాలని ప్రయత్నం చేశారు కానీ అప్పుడు కూడా ఆదివాసి సంఘాలు అడ్డుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో మన్యసీమ పరిరక్షణ సమితి డోలు దెబ్బ రాష్ట్ర అధ్యక్షులు గొప్ప వీరయ్య, మన్యసీమ పరిరక్షణ సమితి డోలు దెబ్బ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఈసం యాదయ్య, జిల్లా అధ్యక్షులు ఈసం రాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి తోలేం సుధాకర్, మంగపేట మండల అధ్యక్షుడు తాటి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


