మల్యాలలో విషాదం:

కుమారుడితో కలిసి బావిలో దూకి తల్లి ఆత్మహత్య

మల్యాలలో విషాదం:

మల్యాల,  జగిత్యాల జిల్లా మల్యాల మండల కేంద్రంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కన్న కొడుకుతో కలిసి ఓ తల్లి బావిలో దూకి ప్రాణాలు తీసుకున్న హృదయవిదారక ఘటన స్థానికంగా కలకలం రేపింది. ​పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం. మల్యాలకు చెందిన గుండేటి కవిత (36) తన భర్త దశరథంతో కలిసి నివసిస్తోంది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ముత్యంపేట గుడిపేట శివారులోని ఓ వ్యవసాయ బావి వద్ద చెప్పులు, సెల్‌ఫోన్ పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అంతకుముందు బాధితురాలు తన అన్న కొమురయ్యకు ఫోన్ చేసి, అన్నా.. నేను చనిపోతున్నా అని చెప్పినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ​సమాచారం అందుకున్న ఎస్సై సందీప్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. బావిలో నుంచి మృతదేహాలను వెలికితీసి, పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల ఖచ్చితమైన కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న ఎస్సై సందీప్ దర్యాప్తు ప్రారంభించారు.

Views: 158

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్
నాగర్ కర్నూల్  :నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం కోడేరు మండలం బావాయిపల్లి గ్రామంలో జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ గురువారం ఆకస్మిక పర్యటన చేపట్టారు.గ్రామంలోని...
చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శం
అచ్చంపేటలో ఘనంగా చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి వేడుకలు
అచ్చంపేటలో ఘనంగా చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి వేడుకలు
బడికి వెళ్దాం.. భవిష్యత్తును మార్చుకుందాం!
బిజినపల్లిలో ఘనంగా తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ 41వ వర్ధంతి
ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు