వీర నారి చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి ప్రతి ఒక్కరికి ఆదర్శం కావాలి.

 మున్సిపల్ చైర్మన్ బండారి అనూష సతీష్ 

వీర నారి చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి ప్రతి ఒక్కరికి ఆదర్శం కావాలి.

తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకల్లో పాల్గొని నివాళులర్పించిన  ఏఎంసీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బండారి అనూష సతీష్ 

ఆదిలాబాద్  : తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలను ఆదిలాబాద్‌ పట్టణం లోని రిమ్స్ మెడికల్ ఆసుపత్రి ఎదురుగా ఉన్న ఆమె విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజర్షి షా, అడిషనల్ కలెక్టర్ రాజేశ్వర్, జాయింట్ కలెక్టర్  చిత్రు, మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనుష సతీష్  లతోకలిసి ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి, ముఖ్య అతిథిగా పాల్గొని, వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో బీసీ వెల్ఫేర్ అధికారిణి సునీత కుమారి , మున్సిపల్ కమీషనర్ జగదీష్ గౌడ్ , బీసీ సంఘం నాయకులు చిక్కల దత్తు, కలాల శ్రీనివాస్ , రజక సంఘం అధ్యక్షులు కార్తీక్, తదితరులు పాల్గొని ఐలమ్మ ఆశయాలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి,పుర అధ్యక్షురాలు బండారి అనూష సతీష్ లు మాట్లాడుతూ సబ్బండ వర్గాల ఆత్మగౌరవానికి, మహిళా చైతన్యానికి చాకలి ఐలమ్మ   ప్రతీక అని అన్నారు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడి తెలంగాణ ప్రజల తెగువను, పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటిన ఆమె తెలంగాణ ప్రజలందరికీ ఆదర్శమని వారి ఆశయసాధనకు ప్రతీ ఒక్కరం కృషి చేయాలనీ పిలుపునిచ్చారు.

Views: 0

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Related Posts

Error on ReusableComponentWidget

Latest News

పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్
నాగర్ కర్నూల్  :నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం కోడేరు మండలం బావాయిపల్లి గ్రామంలో జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ గురువారం ఆకస్మిక పర్యటన చేపట్టారు.గ్రామంలోని...
చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శం
అచ్చంపేటలో ఘనంగా చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి వేడుకలు
అచ్చంపేటలో ఘనంగా చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి వేడుకలు
బడికి వెళ్దాం.. భవిష్యత్తును మార్చుకుందాం!
బిజినపల్లిలో ఘనంగా తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ 41వ వర్ధంతి
ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు