సుల్తాన్‌పూర్‌లో వృథాగా పారుతున్న నీరు.. పట్టించుకోని అధికారులు
* చాయ్ స్కా హోటల్ సమీపంలో రోడ్డుపాలవుతున్న నీరు.. స్థానికుల ఆగ్రహం * ప్రచారాలకే పరిమితమైన నీటి సంరక్షణ అవగాహన సదస్సులు * తక్షణమే చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల డిమాండ్
చౌటకూర్ : ఒకవైపు ప్రభుత్వం 'ప్రతి నీటి బొట్టునూ పొదుపుగా వాడుకోవాలి' అంటూ పెద్ద ఎత్తున అవగాహన కల్పిస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు ఇందుకు విరుద్ధంగా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండల పరిధిలోని సుల్తాన్‌పూర్ గ్రామంలో, చాయ్ స్కా హోటల్ సమీపంలో విలువైన నీరు భారీగా వృథా అవుతుండటంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.భూగర్భ జలాలు రోజురోజుకూ అడుగంటిపోతున్న తరుణంలో నీటి సంరక్షణ అత్యంత ఆవశ్యకమని అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే గ్రామంలో కళ్లెదుటే ఇంతలా నీరు వృథాగా పోతున్నా సంబంధిత శాఖల అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఒకవైపు తాగునీటి అవసరాలు పెరుగుతుంటే, మరోవైపు ఇలా నిర్లక్ష్యంగా నీటిని వృథా చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు.ఇప్పటికైనా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి, నీరు వృథాగా పారుతున్న ప్రాంతాన్ని పరిశీలించి సమస్యను పరిష్కరించాలని, నీటి వృథాను అరికట్టేందుకు తగిన చర్యలు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


