జిల్లా గ్రంథాలయంలో మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభం
మెదక్, : జిల్లా కేంద్రమైన మెదక్ లోని కేంద్ర గ్రంథాలయంలో పాఠకుల సౌకర్యార్తం మినరల్ వాటర్ ప్లాంటును జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్ పర్సన్ సుహాసిని రెడ్డి బుధవారం నాడు ప్రారంభించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన మెదక్ జిల్లా విద్యాశాఖ అధికారి (DEO) రాజు పాల్గొన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీ పరీక్షలకు సిద్ధమవుతూ గ్రంథాలయంలో నిరంతరం చదువుకుంటున్న విద్యార్థులకు తాగునీటి సమస్య తలెత్తకుండా, వారి అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ మినరల్ వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేయడం జరిగింది. దీని ద్వారా విద్యార్థులకు స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా నీటి వృథాను అరికట్టే ఉద్దేశంతో ప్లాంట్ నుంచి వెలువడే వ్యర్థ నీటిని చేతులు కడుక్కోవడానికి వినియోగించేలా, అనంతరం ఆ నీటిని గ్రంథాలయ ప్రాంగణంలోని మొక్కలకు మళ్లించే విధంగా ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది. విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు నీటి సంరక్షణ, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ కార్యదర్శి మరియు గ్రంథాలయ సిబ్బంది పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


