వెన్నచేడ్‌లో రూ.2 కోట్లతో రూఫ్‌టాప్ సోలార్ విద్యుత్ పథకాన్ని ప్రారంభించిన పరిగి ఎమ్మెల్యే TRR గారు

వెన్నచేడ్‌లో రూ.2 కోట్లతో రూఫ్‌టాప్ సోలార్ విద్యుత్ పథకాన్ని ప్రారంభించిన పరిగి ఎమ్మెల్యే TRR గారు

గండీడ్   మండలం : గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి మరియు విద్యుత్ శాఖ మంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారి నేతృత్వంలో గండీడ్ మండలం వెన్నచేడ్ రెవెన్యూ గ్రామంలో రూ.2 కోట్లతో రూఫ్‌టాప్ సోలార్ విద్యుత్ పథకాన్ని ప్రారంభించినట్లు పరిగి ఎమ్మెల్యే,టీపీసీసీ ట్రైనింగ్ కమిటీ చైర్మన్ (SIR) డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి గారు తెలిపారు.

ఈ పథకం ద్వారా ప్రతి ఇంటిపై సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసి రోజుకు సుమారు 8 యూనిట్లు, నెలకు 240 యూనిట్ల వరకు విద్యుత్ ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. గృహ అవసరాలకు వినియోగించిన తర్వాత మిగిలిన విద్యుత్‌ను నిబంధనల ప్రకారం గ్రిడ్‌కు సరఫరా చేసి ఆర్థిక ప్రయోజనం పొందే అవకాశం ఉంటుందని తెలిపారు.

వెన్నచేడ్ రెవెన్యూ గ్రామ పరిధిలోని అనుబంధ గ్రామాలతో పాటు పరిగి నియోజకవర్గంలోని మరిన్ని గ్రామాలకు ఈ పథకాన్ని దశలవారీగా విస్తరించేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే గారు స్పష్టం చేశారు.

 ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ నవనీత చెన్నయ్య, ఉపసర్పంచ్ రవికాంత్ రెడ్డి, గ్రామ యువకులు, యువజన సంఘ సభ్యులు, గ్రామ పెద్దలు, ఉపాధ్యాయులు, మేధావులు పాల్గొనడం జరిగింది

Views: 2

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

వెన్నచేడ్‌లో రూ.2 కోట్లతో రూఫ్‌టాప్ సోలార్ విద్యుత్ పథకాన్ని ప్రారంభించిన పరిగి ఎమ్మెల్యే TRR గారు వెన్నచేడ్‌లో రూ.2 కోట్లతో రూఫ్‌టాప్ సోలార్ విద్యుత్ పథకాన్ని ప్రారంభించిన పరిగి ఎమ్మెల్యే TRR గారు
గండీడ్   మండలం : గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి మరియు విద్యుత్ శాఖ మంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారి...
పెద్దశంకరంపేట మండలంలో కల్లు దుకాణాలపై ఎక్సైజ్ అధికారుల తనిఖీలు
ఆర్యవైశ్యుల రాజకీయ చైతన్యానికి కృషి చేస్తా
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయం, వరంగల్
బండ్లగూడెంలో 'కేతి బచావో అభియాన్' – ఆరుతడి పంటల సాగుపై రైతులకు అవగాహన
ఫత్లాపూర్ పాఠశాలలో చట్టాలపై అవగాహన కార్యక్రమం
లింగన్నపేట లోఘనంగా శ్రీ వెంకటేశ్వర స్వామి రథోత్సవం