బండ్లగూడ రోడ్డు సమస్య పరిష్కారానికి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి చొరవ

సొంత నిధులతో రోడ్డు చదును పనులు.. ఐదు రోజులుగా పర్యవేక్షిస్తున్న మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్

 బండ్లగూడ రోడ్డు సమస్య పరిష్కారానికి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి చొరవ

పటాన్‌చెరు : జేపీ కాలనీ డివిజన్ పరిధిలోని బండ్లగూడకు వెళ్లే రహదారిపై ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించేందుకు పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి చొరవ తీసుకున్నారు. అక్రమ్ కేఫ్ నుంచి బండ్లగూడ వరకు ఉన్న రహదారిపై పేరుకుపోయిన మట్టి కుప్పలు, పిచ్చి మొక్కలను తన సొంత నిధులతో తొలగిస్తూ రోడ్డు చదును పనులు చేపట్టారు.
ఈ పనులను మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ గత ఐదు రోజులుగా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ట్రాక్టర్లు, జేసీబీ యంత్రాల సహాయంతో మట్టి కుప్పలను తొలగిస్తూ రహదారిని చదును చేసే పనులను వేగవంతం చేస్తున్నారు.
ఈ సందర్భంగా మెట్టు కుమార్ యాదవ్ మాట్లాడుతూ, బండ్లగూడ ప్రజలు రాకపోకల సమయంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించడమే లక్ష్యంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సహకారంతో ఈ పనులు చేపట్టినట్లు తెలిపారు. రహదారిని మరింత సౌకర్యవంతంగా, విశాలంగా తీర్చిదిద్దేందుకు త్వరలో జీహెచ్‌ఎంసీ లేదా కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌) నిధులతో శాశ్వత అభివృద్ధి పనులు చేపట్టేందుకు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు.
ఈ మేరకు IELAకు సంబంధించిన సుధీర్ రెడ్డి, రంజిత్‌లతో చర్చలు జరిపినట్లు తెలిపారు. రహదారి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించి, స్థానిక ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు మెట్టు కుమార్ యాదవ్ పేర్కొన్నారు.

Views: 6

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

గంభీరావుపేట మార్కెట్ కమిటీ పాకవర్గం నియామకం గంభీరావుపేట మార్కెట్ కమిటీ పాకవర్గం నియామకం
గంభీరావుపేట మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గాన్ని  ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. మార్కెట్ కమిటీ  చైర్మన్ మహ్మద్ హమీద్, వైస్ ఛైర్మ న్ మేడ...
పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపులు ప్రారంభం
రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు ఆల్ఫోర్స్ హుస్నాబాద్ విద్యార్థుల ఎంపిక
ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ఖర్గే అనుచిత వ్యాఖ్యలు.. బీజేపీ ఆగ్రహం
హుస్నాబాద్‌లో 28 మందికి కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ
గ్రాడ్యుయేట్లలో తగ్గిన జోష్.. MLC ఓటరు నమోదుకు తూతూ మంత్రంగా స్పందన!
ప్రధాని మోదీపై ఖర్గే అనుచిత వ్యాఖ్యలు సహించేది లేదు: బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భరత్ ప్రసాద్ పోతుగంటి