చౌటకూర్ మండలంలో ఐదు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి – ప్రజాప్రతినిధులు
చౌటకూర్ : రైతులకు పండించిన వరి ధాన్యాన్ని విక్రయించేందుకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ప్రజాప్రతినిధులు సూచించారు.సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండల పరిధిలోని వెండికోల్, తాడ్దాన్పల్లి, ఉప్పరిగూడెం, పోసానిపల్లి, బొమ్మారెడ్డిగూడెం గ్రామాల్లో మొత్తం ఐదు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. వీటిలో ఒకటి డీసీఎంఎస్ ఆధ్వర్యంలో, నాలుగు ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బోడపట్ల గణేష్ మాట్లాడుతూ.. రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి ప్రభుత్వ మద్దతు ధరను పొందాలని సూచించారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు ధాన్యం విక్రయాల్లో పారదర్శకత ఉండేలా కొనుగోలు కేంద్రాలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. రైతులు దళారులను ఆశ్రయించకుండా నేరుగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ మల్లారెడ్డి , సంగారెడ్డి జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు నందికంటి రామచంద్రారెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు లక్ష్మి,మండలం కాంగ్రెస్ పార్టీ ఉప అధ్యక్షుడు మహిపాల్ రెడ్డి, సర్పంచులు మల్లారెడ్డి, గోల్ల మల్లేశం, అంజమ్మ,సంధ్యా మల్లికార్జున్ గౌడ్,రేణుక బాలు రాజు, రాజశేఖర్, జైపాల్ నాయక్, ఉప సర్పంచ్ మౌలానా, మహేష్, కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు మక్సూద్ అలీ, యువజన అధ్యక్షుడు కాశీనాథ్, సంజయ్, శ్రీనివాసరెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, మాజీ సర్పంచ్ జయరాం రెడ్డి, వెండి కోల్ రాములు, రాం రెడ్డి, మల్లేశం , ప్రభాకర్ రెడ్డి, మనవల్లి సుధాకర్, లక్ష్మణ్, సాజిత్, కుమ్మరి సాయిలు, గణేష్నాయక్ , సుధాకర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


