పోలీసు అమరవీరుల త్యాగం మరువలేనిది

జనసేన రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ గడల శ్రీనివాసరావు

పోలీసు అమరవీరుల త్యాగం మరువలేనిది

కొత్తగూడెం: దేశ ప్రజల ప్రాణాలను కాపాడుతూ, సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన వీర పోలీసు అమరవీరులకు జనసేన పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ, వరంగల్ -నల్గొండ - ఖమ్మం ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ గడల శ్రీనివాసరావు ఘన నివాళులర్పించారు. పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన మాట్లాడుతూ.. ప్రజల భద్రతే లక్ష్యంగా, విధి నిర్వహణలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా అమరులైన పోలీసుల సేవలు, త్యాగాలను దేశ ప్రజలు ఎన్నటికీ మరువలేరన్నారు. పోలీసు అధికారి విధులకు వెళ్లినప్పుడు తిరిగి వస్తాడని ఎదురుచూసే తల్లి, క్షేమంగా ఇంటికి చేరుకుంటాడని ఆశించే భార్య, నాన్న రాక కోసం ఎదురుచూసే పిల్లలు ఉంటారని పేర్కొన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయినప్పుడు ఆ కుటుంబాల్లో తీరని విషాదం, చెరిగిపోని జ్ఞాపకాలు, జీవితాంతం వెంటాడే వేదన మిగులుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుటుంబాల ప్రేమానురాగాలను పక్కనపెట్టి, ప్రజల భద్రతను కర్తవ్యంగా భావించి దేశం కోసం ప్రాణాలు అర్పించిన పోలీసు అమరవీరుల త్యాగం వెలకట్టలేనిదన్నారు. వారి సేవలు ఒక్క రోజుకే పరిమితం కావని, దేశం ఉన్నంతకాలం వారి ధైర్యసాహసాలు, సేవా స్ఫూర్తి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని అన్నారు. దేశ రక్షణ కోసం ప్రాణాలర్పించిన ప్రతి వీర పోలీసు అమరవీరుడికి హృదయపూర్వక అశ్రునివాళులు అర్పిస్తున్నామని, వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని పేర్కొన్నారు. అమరవీరుల త్యాగాలకు యావత్ సమాజం ఎల్లప్పుడూ రుణపడి ఉంటుందని, వారు భౌతికంగా మన మధ్య లేకపోయినా ప్రజల హృదయాల్లో చిరస్థానాన్ని సంపాదించుకున్నారని డాక్టర్ గడల శ్రీనివాసరావు అన్నారు. వీర పోలీసు అమరవీరుల త్యాగం మరువలేనిదని, వారి ధైర్యసాహసాలు భావితరాలకు స్ఫూర్తిదాయకమని ఆయన కొనియాడారు.

Views: 5

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

చెడుపై మంచి సాధించిన విజయమే విజయదశమి.. చెడుపై మంచి సాధించిన విజయమే విజయదశమి..
ఊరుకొండ : నాటినుండి నేటి వరకు నీతి నిజాయితీ, న్యాయం ధర్మం ఎన్నటికైనా విజయాన్ని సాధిస్తాయని గుర్తుచేసే.. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా విజయదశమి పర్వదినాన్ని...
విధి నిర్వహణలో పోలీసుల త్యాగాలు చిరస్మరణీయం
పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి
పోలీసు అమరవీరుల త్యాగం మరువలేనిది
నేడు పత్తి కొనుగోళ్లు ప్రారంభం... కలెక్టర్ రాజర్షి షా 
పుల్లారెడ్డి స్వీట్ హౌస్ అధినేత మృతదేహానికి నివాళులర్పించిన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
నల్లగొండలో ఘనంగా పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం: