పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలి: కలెక్టర్ కుమార్ దీపక్

పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలి: కలెక్టర్ కుమార్ దీపక్

నస్పూర్ (మంచిర్యాల): ప్రజా సంక్షేమ పథకాలను సమన్వయంతో, సమర్థవంతంగా అమలు చేయాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు. నస్పూర్‌ కలెక్టరేట్‌లో మంగళవారం రెవెన్యూ, భూ సమస్యలు, సంక్షేమ పథకాలపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణి, రెవెన్యూ సదస్సుల ద్వారా వచ్చిన దరఖాస్తులను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించాలి. రీ-సర్వే ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు సాదాబైనామా, 22-ఎ, భూభారతి దరఖాస్తులను నిబంధనల ప్రకారం క్లియర్ చేయాలి. కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను అర్హులకు సత్వరమే అందించాలి. అక్రమ ఇసుక రవాణాపై కఠిన పర్యవేక్షణ ఉండాలని, భూసేకరణ పరిహారం చెల్లింపులు త్వరితగతిన పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఈ సమీక్షలో అదనపు కలెక్టర్ వి.రాములు, సబ్ కలెక్టర్ మనోజ్, డీఆర్వో మోతీరామ్, ఆర్డీవో శ్రీనివాస్ రావు, తహసిల్దార్లు పాల్గొన్నారు.

Views: 2

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

పీఏసీఎస్‌ ద్వారా వరి నాణ్యమైన విత్తనోత్పత్తిపై అవగాహన కార్యక్రమం  పీఏసీఎస్‌ ద్వారా వరి నాణ్యమైన విత్తనోత్పత్తిపై అవగాహన కార్యక్రమం 
మాగనూరు : నాబార్డ్ నిధులతో నిర్వహిస్తున్న ప్రాజెక్టులో భాగంగా మాగనూర్ మండలం కేంద్రంలో పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో వరి నాణ్యమైన విత్తనోత్పత్తిపై రైతులు మరియు పీఏసీఎస్‌ సిబ్బందికి అవగాహన...
నందివడ్డేమాన్‌లో ఫెర్టిలిటీ క్యాంప్‌ను పరిశీలించిన కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్
ఖానాపూర్ గ్రామంలో భూముల రీ సర్వే పరిశీలించిన కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్
వొడితల సతీష్ కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా
గురుకుల, కేజీబీవీ పాఠశాలలు, పి హెచ్ సి ని తనిఖీ చేసిన  జిల్లా కలెక్టర్ 
చిలిపిచెడ్ మండల సర్వసభ్య సమావేశంలో సర్పంచ్ అనిల్ ఆగ్రహం
విద్యుత్ ఏఈ గారు... మీరెక్కడ