విద్యుత్ ఏఈ గారు... మీరెక్కడ

విద్యుత్ ఏఈ గారు... మీరెక్కడ

  • వినతిపత్రం ఇచ్చి ఐదు నెలలు గడిచిన పని శూన్యం 
  • రాందాస్ గూడ గ్రామస్తుల ఆవేదన 

చిలిపిచేడ్ : చిలిపిచేడ్ మండల పరిధిలోని రాందాస్ గూడ గ్రామంలోని కొత్తకాలని నాల్గవ వార్డ్ లో పురాతనమైన కరెంట్ స్తంభం రోజురోజుకూ క్షిణిస్తూ స్తంభంలోని రాడ్డ్ తేలడంతో గత ఐదు నెలల క్రితం గ్రామ సభలో మాట్లాడి గ్రామ పంచాయతీ లెటర్ పాడ్ పై రాసి ఆ స్తంభాన్ని తొలగించి కొత్త స్తంభం ఏర్పాటు చేయాలని మండల విద్యుత్ ఏఈ రాకేష్ కి గ్రామ సర్పంచ్ గౌరీ శ్రీధర్ రెడ్డి ఉప సర్పంచ్ మధుసూదన్ వార్డు మెంబర్లు గ్రామస్తులు అంతా కలిసి పంచాయతీ కార్యాలయంలో వినతి పత్రం అందజేయగా దానికి విద్యుత్ ఏఈ రాకేష్ త్వరలో నూతన స్తంభాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. కానీ వినతి పత్రం అందజేసి ఐదు నెలలు గడిచిన విద్యుత్ ఏఈ కనీసం ఐదు నెలలుగా గ్రామంలోకి రాలేదు పనిని ప్రారంభించలేదని, స్తంభం మరింత క్షీణించడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో అని భయం భయంగా ఉండాల్సి వస్తుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై రాందాస్ గూడ గ్రామ నాలుగో వార్డ్ మెంబర్ వినతిపత్రం ఇచ్చిన నెల రోజుల తర్వాత ఏఈ రాకేష్ ని కలిసి అడగగా స్తంభాలు లేవని చెప్పారని కానీ ప్రస్తుతం సబ్ స్టేషన్ లోకి స్తంభాలు వచ్చి కూడా నెలరోజులు అవుతుందని అయినా రాంబస్ కూడా గ్రామం విషయాన్ని ఏఈ మర్చిపోయారని ప్రమాదం సంబంధించిన తర్వాత స్పందించిన ఏమీ లాభం ఉండదని నాల్గవవార్డ్ మెంబర్ నూలి బాబురావు ఆవేదన వ్యక్తం చేశారు.

విద్యుత్ ఏఈ రాకేష్ వివరణ:
 ఇట్టి విషయంపై విద్యుత్ రాకేష్ ని మా ప్రతినిధి ఫోన్లో సంప్రదించగా వినతి పత్రం ఇచ్చిన మాట వాస్తవమే అప్పట్లో స్తంభాలు లేని కారణంగా పని కొంచెం డీలా జరిగింది. ప్రస్తుతం స్తంభాలు ఉన్నాయి కానీ రాందాస్ గూడ గ్రామంలో కాంట్రాక్టర్ కి ఈ పంట కోత కాలం ముగిసిన తర్వాత మూడు నుండి నాలుగు ట్రాన్స్ఫార్మర్లు వాటికి స్తంభాలు వేసే పని ఉన్న కారణంగా ఆ సమయంలోనే ఈ పనిని పూర్తి చేస్తామని ఈ ఒక్క స్తంభాన్ని చేయడానికి కాంట్రాక్టర్ కి లేబర్ కూడా అన్ని విధాల సహకరించడానికి వీలుపడడం లేదని పంటలు కోయగాని వీలైనంత తొందరగా నూతన స్తంభాన్ని వేయిస్తానని తెలిపారు.

Views: 3

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

పీఏసీఎస్‌ ద్వారా వరి నాణ్యమైన విత్తనోత్పత్తిపై అవగాహన కార్యక్రమం  పీఏసీఎస్‌ ద్వారా వరి నాణ్యమైన విత్తనోత్పత్తిపై అవగాహన కార్యక్రమం 
మాగనూరు : నాబార్డ్ నిధులతో నిర్వహిస్తున్న ప్రాజెక్టులో భాగంగా మాగనూర్ మండలం కేంద్రంలో పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో వరి నాణ్యమైన విత్తనోత్పత్తిపై రైతులు మరియు పీఏసీఎస్‌ సిబ్బందికి అవగాహన...
నందివడ్డేమాన్‌లో ఫెర్టిలిటీ క్యాంప్‌ను పరిశీలించిన కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్
ఖానాపూర్ గ్రామంలో భూముల రీ సర్వే పరిశీలించిన కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్
వొడితల సతీష్ కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా
గురుకుల, కేజీబీవీ పాఠశాలలు, పి హెచ్ సి ని తనిఖీ చేసిన  జిల్లా కలెక్టర్ 
చిలిపిచెడ్ మండల సర్వసభ్య సమావేశంలో సర్పంచ్ అనిల్ ఆగ్రహం
విద్యుత్ ఏఈ గారు... మీరెక్కడ