ఉప్పర్ షేర్వాని అందర్ పారేశాని
నిజామాబాద్ జిల్లా : నిజామాబాదు జిల్లా బాల్కొండ లో నూతనంగా ఏర్పడ్డ గ్రామ పంచాయతీ తీరు "ఉప్పర్ షేర్వాని అందర్ పారేశాని " లా ఉందని స్థానిక ప్రజలు పౌరులు వాపో తున్నారు.స్థానిక సర్పంచ్ ఉపసర్పంచ్ ఏక పక్ష నిర్ణయాలు ప్రభుత్వం నుండి వచ్చే నిధుల ఖర్చు వ్యవహరల పై ప్రశ్నిస్తూ సమాచార చట్టం పరిధిలో స్థానికులు దరఖాస్తూ చేసుకోవడంతో బాల్కొండ ప్రజలు హర్షo వ్యక్తం చేస్తున్నారు.నూతన గ్రామ పాలక మండలి గెలిచి (09) నెలలో గ్రామంలోని
రోడ్లు మురికి కాలువలు అద్వానంగా ఉన్నాయని
ప్రజలు ఆరోపిస్తున్నారు.
ఇది ఇలా ఉండగా గ్రామ పరిశుధ్యం పేరుతో గ్రామ పంచాయతీ సభ్యులకు తెలియకుండా ఊర్లోని ఆడ పడుచులు ఇంటి ముందు
పేడ తో " అలుకు చల్లి నట్లు " గ " మొరం పోసి ఎన్ని లక్షలు డ్రా చేసారో అని ప్రజలు ఆరోపిస్తున్నారు. అలాగే
తేదీ 22 -10-2026 బతుకమ్మ ఉత్సవాలు స్కూల్లో గ్రౌండ్ లో సర్పంచ్ ఉప సర్పంచ్ గ్రామ పంచాయతీ కార్యదర్శి తో పాటు (02) సభ్యులతో కలసి బతుకమ్మ ఉత్సవాలు ఏర్పాటు చేసారు, స్కూల్ గ్రౌండ్ లో ఆడిన ఒక్కో బతుకమ్మ గ్రూపు లోని ఒక్క మహిళకు రూ,, 200/-
చెల్లించారు ఈ డబ్బులు ఎవరివి ? గ్రామ ప్రజలు ప్రశ్నిస్తున్నారు.పైగా బతుకమ్మ ఉత్సవాలు స్కూల్లో గ్రౌండ్ లో ఏర్పాటు చేస్తే ఊర్లోని చాలా మంది మహిళా గ్రూపుల వారు
స్కూల్లో గ్రౌండ్ కు రాకుండా దేశ స్వాతంత్రo పూర్వం నుండి ప్రతి సంవత్సరo బాల్కొండ, ఊరిలోని " బజార్ కూడలీ "
వద్దకు కొన్ని బృందాలు అలాగే చెరువు వద్ద మైదానానికి కొన్ని బృందాలు చేరుకొని బతుకమ్మ ఉత్సవాలు చేసుకున్నారని ఊరి ప్రజలు వాదిస్తున్నారు.
బతుకమ్మ ఉత్సవాలు స్కూల్లో గ్రౌండ్ లో కాకుండా ఊరి పెద్ద చెరువు పక్కన ఉన్న నాందేడ్ బేస్ వద్ద బ్రతుకమ్మ ఉత్సవాలు నిర్వహనికి
ఎట్పాట్లు చేసి ఉంటె బాగుండేదని బాల్కొండ ప్రజానికం అనుకుంటున్నారు.
తలుపులు మూసి సమావేశమా
గ్రామ పంచాయయతి సమావేశం మంగళవారం ఉదయం సమావేశపు హాలు తలుపులు మూసి సమావేశం ఎందుకు ఏర్పాటు చేసారని
గ్రామంలో మొరం, స్కూల్ గ్రౌండ్ లో బ్రతుకమ్మ ఉచ్చవాలు ఎవరిని అడిగి నిర్వహించారని అనేక మంది సభ్యులు సర్పంచ్, ఉప సర్పంచ్ ను నిలదీశారని తెలుస్తుంది.
బాల్కొండ ఏమైనా తీవ్ర వాద కేంద్రమా ?
గ్రామ పంచాయతీ సమావేశం హాలు ముందు గ్రామ పంచాయతీ సిబ్బందితో కాపలాగా ఎందుకు ఉంచారని
బాల్కొండ ఏమైనా తీవ్ర వాద కేంద్రమా ? అని ప్రజలు పౌరులు ప్రశ్నిస్తున్నారు.
పాత గేట్ కు కలరా ?
గ్రామ పంచాయతి ఎన్నికలు కాగానే పూర్వం నుండి ఉన్న ప్రధాన ఐరన్ గేట్ కు కలర్ పూసి కొత్త గేట్ కొన్నట్లు రికార్డు ఎలా చేసారని స్థానిక ప్రజలు పౌరులు సీనియర్ సిటిజన్స్ యువకులు ప్రశ్నిస్తున్నారు.
ఏది ఏమైనా బాల్కొండ గ్రామ పంచాయతీ తీరు " ఉప్పర్ షేర్వాని అందర్ పారేశాని " లా ఉందని ప్రజానీకం నవ్వు కుంటున్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Related Posts

