రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన పిల్లుట్ల విద్యార్థిని జిల్లాస్థాయి జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్లో ప్రతిభ
శివంపేట : మండలంలోని పిల్లుట్ల గ్రామానికి చెందిన 9వ తరగతి విద్యార్థిని బుర్ర శ్రీనిధి జిల్లా స్థాయి జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ పోటీల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయికి ఎంపికైంది. గడ్డి, కొబ్బరిపీచు, ఆకులు, వెదురును ఉపయోగించి నేల కోతను అరికట్టే వినూత్న ప్రాజెక్టును రూపొందించి అందరి ప్రశంసలు అందుకుంది. ఈ ప్రాజెక్టుకు జిల్లా స్థాయిలో అవార్డు లభించింది. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి రాజు, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి చేతుల మీదుగా శ్రీనిధి అవార్డును అందుకుంది. రాష్ట్రస్థాయికి ఎంపిక కావడంతో విద్యార్థినిని ఉపాధ్యాయులు, గ్రామస్తులు అభినందించారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


