కుటుంబానికి ఆర్థిక భరోసా.. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోండి

అర్హులైన ప్రతి కుటుంబం దరఖాస్తు చేసుకోవాలి: సర్పంచ్ అజ్మీరా సారక్క

కుటుంబానికి ఆర్థిక భరోసా.. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోండి

మల్హర్ రావు : రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని గ్రామ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని అడ్వాలపల్లి గ్రామ సర్పంచ్ అజ్మీరా సారక్క కోరారు.ఈ పథకం ద్వారా అర్హులైన కుటుంబాలకు రూ.5 లక్షల జీవిత బీమా ప్రయోజనం కల్పించనున్నట్లు తెలిపారు. కుటుంబాన్ని పోషించే వ్యక్తి మరణించిన సందర్భంలో ఆ కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించడం, కుటుంబ సభ్యుల భవిష్యత్తుకు భద్రత కల్పించడం ఈ పథకం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. 18 నుంచి 59 సంవత్సరాల వయస్సు గల కుటుంబ పోషకులు బీమా పొందేందుకు అర్హులుగా ఉంటారని వివరించారు.ఈ సందర్భంగా అడ్వాలపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకానికి సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గ్రామంలోని అర్హులైన కుటుంబాల వారు అవసరమైన వివరాలతో గ్రామ పంచాయతీ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సర్పంచ్ సూచించారు.ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ ఇప్ప మొండయ్య, బీఆర్ఎస్ జిల్లా యువజన నాయకుడు అజ్మీరా బాలాజీ నాయక్, ఉపసర్పంచ్ బానోత్ రాజేందర్, బీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు అడ్వాల రాజు, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ దివ్య, పంచాయతీ కార్యదర్శి సరస్వతి, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Views: 2

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News