ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా శాంతియుత పోరాటం కొనసాగిస్తాం: డాక్టర్ ఆర్.ఎస్. రత్నాకర్
మహబూబ్‌నగర్, : ఎస్సీ వర్గీకరణ కారణంగా తెలంగాణలో మాల సామాజిక వర్గం ఉనికి కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని, ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోందని మాల మహానాడు అండ్ రాక్స్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ ఆర్.ఎస్. రత్నాకర్ ఆరోపించారు. శుక్రవారం మహబూబ్‌నగర్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణకు బీజం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే వేసిందని, అనంతరం దేశవ్యాప్తంగా అమలయ్యే పరిస్థితి ఏర్పడిందని ఆయన విమర్శించారు. ఎస్సీ రిజర్వేషన్ల ద్వారా ఇప్పటికే పరిమిత సంఖ్యలోనే లబ్ధి చేకూరుతోందని, అలాంటి పరిస్థితిలో దేశవ్యాప్తంగా ఉన్న ఎస్సీ కులాలకు, అలాగే తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఎస్సీ వర్గాలకు సమానంగా అవకాశాలను ఎలా కల్పిస్తారో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. సామాజిక న్యాయం పేరుతో దళితుల ఐక్యతను దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. రిజర్వేషన్ల విషయంలో మాత్రమే కాకుండా దేశ సంపద పంపిణీ, మంత్రివర్గాల్లో ప్రాతినిధ్యం వంటి అంశాల్లో కూడా సామాజిక న్యాయం అమలు చేయాలని కోరారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా పార్లమెంట్‌లో చట్టపరమైన మార్పులు జరిగే వరకు తమ ఉద్యమం శాంతియుతంగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా చట్టాలను కూడా మార్చాల్సిన పరిస్థితులు వస్తాయని పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో మాల సామాజిక వర్గ ప్రజాప్రతినిధులు ఈ అంశంపై గళం విప్పాలని, సామాజిక వర్గ ప్రయోజనాల కోసం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ విలేకరుల సమావేశంలో బీరం సతీష్ కుమార్, తలారి రాజన్న, ఎడ్ల కృష్ణయ్య, కానుగడ్డ యాదయ్య, కాశయ్య, భైరం పల్లి నారాయణ, బోగరి విజయ్ కుమార్, అనిమల్ల నరహరి, నానీ, చిన్నా తదితరులు పాల్గొన్నారు.
Views: 134
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
31 Jul 2026 18:20:28
వరంగల్ / నర్సంపేట : తెలంగాణ ఉద్యమ క్షేత్రంలో.. నర్సంపేట రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన కీలక నేత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అకాల...
