సామాజిక బాధ్యతకు నిదర్శనం... విద్యార్థులతో సహపంక్తి భోజనం చేసిన డా. ప్రభుదయాల్

WhatsApp Image 2026-03-01 at 3.06.28 PM

 

కొత్తగూడెం : కొత్తగూడెం మండల మాజీ విశ్రాంత విద్యాశాఖ అధికారి డా. ప్రభుదయాల్ మరోసారి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. నేడు (01-03-2026) పాత కొత్తగూడెంలోని అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థులకు ప్రత్యేక మెనూతో భోజనం ఏర్పాటు చేసి, వారితో సహపంక్తి భోజనం చేశారు.
పాఠశాలలో విద్యా అవసరాలు ఉన్న విద్యార్థులను గుర్తించి, వారి అవసరాలను ఎప్పటికప్పుడు తీర్చేందుకు ఆయన కృషి చేస్తున్నారు. తన చిన్ననాటి అనుభవాలను స్మరించుకుంటూ, ఇతర విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకూడదనే సంకల్పంతో విద్యాభివృద్ధికి తోడ్పాటునందిస్తున్నారు.ఈ సందర్భంగా విద్యార్థులకు చదువు ప్రాముఖ్యతను వివరించి, క్రమశిక్షణతో, పట్టుదలతో చదువుకోవాలని సూచించారు. చదువుకు సంబంధించిన ఎలాంటి అవసరాలైనా తనకు తెలియజేయాలని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఆయన కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులు నరేష్, శంకర్‌లు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

Views: 23

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News