నందివడ్డేమాన్‌లో ఫెర్టిలిటీ క్యాంప్‌ను పరిశీలించిన కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్

నందివడ్డేమాన్‌లో ఫెర్టిలిటీ క్యాంప్‌ను పరిశీలించిన కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్

నాగర్ కర్నూల్ జిల్లా బిజినాపల్లి మండలం నందివడ్డేమాన్ గ్రామంలోని ప్రాథమిక పశు వైద్య కేంద్రంలో కొనసాగుతున్న ఫెర్టిలిటీ క్యాంప్ ను జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ పరిశీలించారు.ఈ సందర్భంగా కృత్రిమ గర్భధారణ కార్యక్రమం అమలు తీరును, రైతులకు అందుతున్న పశువైద్య సేవలను కలెక్టర్ ఆరా తీశారు. ముద్ద చర్మ వ్యాధి, జబ్బ వ్యాధి, గొంతువాపు నివారణకు ఎన్ని పశువులకు టీకాలు వేశారు, ఇంకా ఎన్నింటికి వేయాల్సి ఉందో అధికారులను అడిగి తెలుసుకున్నారు. పశువులకు సకాలంలో వైద్య సేవలు, టీకాలు అందించాలని, వ్యాధులు సోకిన వెంటనే గుర్తించి సకాలంలో వైద్యం అందించి, వ్యాప్తి చెందకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని పశువైద్య సిబ్బందికి కలెక్టర్ ఆదేశించారు. పశుసంపద రైతుల జీవనోపాధికి ముఖ్య ఆధారమని, పశువుల ఆరోగ్యం మెరుగ్గా ఉంటేనే రైతులకు ఆర్థిక ప్రయోజనం చేకూరుతుందని అన్నారు. రైతులతో నేరుగా మాట్లాడి పశువైద్య సేవలు సకాలంలో అందుతున్నాయా అని ఆరా తీశారు.కలెక్టర్ వెంట తహసీల్దార్ మునీరుద్దీన్, ఎంపీడీవో కథలప్ప , సర్పంచ్ తిప్పిరెడ్డి.సుగుణమ్మ, పశుసంవర్ధక శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Views: 10

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

పీఏసీఎస్‌ ద్వారా వరి నాణ్యమైన విత్తనోత్పత్తిపై అవగాహన కార్యక్రమం  పీఏసీఎస్‌ ద్వారా వరి నాణ్యమైన విత్తనోత్పత్తిపై అవగాహన కార్యక్రమం 
మాగనూరు : నాబార్డ్ నిధులతో నిర్వహిస్తున్న ప్రాజెక్టులో భాగంగా మాగనూర్ మండలం కేంద్రంలో పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో వరి నాణ్యమైన విత్తనోత్పత్తిపై రైతులు మరియు పీఏసీఎస్‌ సిబ్బందికి అవగాహన...
నందివడ్డేమాన్‌లో ఫెర్టిలిటీ క్యాంప్‌ను పరిశీలించిన కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్
ఖానాపూర్ గ్రామంలో భూముల రీ సర్వే పరిశీలించిన కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్
వొడితల సతీష్ కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా
గురుకుల, కేజీబీవీ పాఠశాలలు, పి హెచ్ సి ని తనిఖీ చేసిన  జిల్లా కలెక్టర్ 
చిలిపిచెడ్ మండల సర్వసభ్య సమావేశంలో సర్పంచ్ అనిల్ ఆగ్రహం
విద్యుత్ ఏఈ గారు... మీరెక్కడ