MCPI(C) మేడ్చల్ జిల్లా పగ్గాలు జయచంద్రరెడ్డికి

MCPI(C) మేడ్చల్ జిల్లా పగ్గాలు జయచంద్రరెడ్డికి

 

  • వామపక్ష ఉద్యమ అనుభవంతో జిల్లా కార్యదర్శిగా బాధ్యతలు
  • యువజన ఉద్యమం నుంచి తిరిగి కమ్యూనిస్టు ఉద్యమం లోకి పునరాగమనం
  • పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యం: రాష్ట్ర కార్యదర్శి లింగంపల్లి శ్రీనివాసరెడ్డి

అక్కన్నపేట :భారత మార్క్సిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ క్లాస్ స్ట్రగుల్ మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కార్యదర్శిగా కా. మాసిరెడ్డి జయచంద్రరెడ్డిని తెలంగాణ రాష్ట్ర కమిటీ నియమించింది. గతంలో సీపీఐ(ఎం),  అనుబంధ యువజన సంఘాల్లో పనిచేసిన అనుభవం, వామపక్ష ఉద్యమంలో ఆయనకు ఉన్న పరిచయాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ బాధ్యతలు అప్పగించినట్లు పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కా. లింగంపల్లి శ్రీనివాసరెడ్డి తెలిపారు. కా. మాసిరెడ్డి జయచంద్రరెడ్డి పెద్దపల్లి జిల్లా గోదావరిఖని, మంథని ప్రాంతాల్లో DYFIలో పనిచేయడంతో పాటు అప్పటి ఉమ్మడి కరీంనగర్ జిల్లా పెద్దపల్లి డివిజన్ కమిటీలో సేవలందించారు. ఉద్యోగ, ఉపాధి అవసరాల రీత్యా హైదరాబాద్‌లోని మియాపూర్ ప్రాంతానికి వచ్చిన అనంతరం MCPI(U) అనుబంధ యువజన సంఘం AIFDYలో పనిచేశారు. గత నాలుగు సంవత్సరాలుగా పార్టీ, యువజన సంఘ కార్యకలాపాలకు దూరంగా ఉన్న ఆయన స్థానిక కార్పొరేటర్ వద్ద ఆఫీస్ కార్యదర్శిగా పనిచేశారు. ప్రస్తుతం ఉప్పల్ ప్రాంతంలోని ఓ విద్యాసంస్థలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నారు. నూతనంగా ఏర్పడిన MCPI(C) ఆశయాలు, సిద్ధాంతాలు నచ్చడంతో తిరిగి కమ్యూనిస్టు ఉద్యమంలోకి వచ్చి పార్టీ రాష్ట్ర కార్యదర్శి కా. లింగంపల్లి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. గతంలో CPIM, MCPI(U) అనుబంధ యువజన సంఘాల్లో నాయకుడిగా, పార్టీ కార్యకర్తగా పనిచేసిన అనుభవాన్ని పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర కమిటీ మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కార్యదర్శి బాధ్యతలను ఆయనకు అప్పగించింది. జిల్లాలో పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేయడంతో పాటు కార్మికులు, యువత, విద్యార్థులు, ఉద్యోగుల సమస్యలపై ఉద్యమాలను నిర్మించేందుకు కృషి చేస్తానని జయచంద్రరెడ్డి తెలిపారు.

Views: 1

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

పీఏసీఎస్‌ ద్వారా వరి నాణ్యమైన విత్తనోత్పత్తిపై అవగాహన కార్యక్రమం  పీఏసీఎస్‌ ద్వారా వరి నాణ్యమైన విత్తనోత్పత్తిపై అవగాహన కార్యక్రమం 
మాగనూరు : నాబార్డ్ నిధులతో నిర్వహిస్తున్న ప్రాజెక్టులో భాగంగా మాగనూర్ మండలం కేంద్రంలో పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో వరి నాణ్యమైన విత్తనోత్పత్తిపై రైతులు మరియు పీఏసీఎస్‌ సిబ్బందికి అవగాహన...
నందివడ్డేమాన్‌లో ఫెర్టిలిటీ క్యాంప్‌ను పరిశీలించిన కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్
ఖానాపూర్ గ్రామంలో భూముల రీ సర్వే పరిశీలించిన కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్
వొడితల సతీష్ కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా
గురుకుల, కేజీబీవీ పాఠశాలలు, పి హెచ్ సి ని తనిఖీ చేసిన  జిల్లా కలెక్టర్ 
చిలిపిచెడ్ మండల సర్వసభ్య సమావేశంలో సర్పంచ్ అనిల్ ఆగ్రహం
విద్యుత్ ఏఈ గారు... మీరెక్కడ