మాగనూర్ మండలంలో వాసవి క్లబ్ జిల్లా గవర్నర్ అధికారిక పర్యటన
మాగనూరు ఆర్యవైశ్య సంఘం సహకారంతో ఎంపీపీ ఎస్ పాఠశాలకు బీరువా బహుకరణ
మాగనూర్ మండల కేంద్రంలో మక్తల్ వాసవి క్లబ్ ఆధ్వర్యంలో వాసవి క్లబ్ జిల్లా వి 108 ఏ గవర్నర్ అధికారిక పర్యటనలో భాగంగా.. జిల్లా గవర్నర్ గోల్డెన్ స్టార్ కేసీజిఎఫ్ కల్మచర్ల రమేష్ సార్ చేతుల మీదుగా ఎంపీపీ ఎస్ పాఠశాలకు మాగనూర్ మండల ఆర్యవైశ్య సంఘము సహకారంతో బీరువాను బహుకరించడం జరిగింది. అలాగే ఆలయ ప్రాంగణంలో వచ్చిన ముఖ్య అతిథి జిల్లా వి 108 ఏ గవర్నర్ గోల్డెన్ స్టార్ కె సి జి ఎఫ్ కల్మచర్ల రమేష్, అతిథులు రీజియన్ చైర్మన్ ప్రతిభా సంకల్పం కే సి జి ఎఫ్ శ్రీకర్ నాగ సావిత్రి, రీజన్ సెక్రెటరీ నీలకాంత్, జెడ్ సి బెండె సత్యవతి, మండల విద్యాధికారి, ప్రిన్సిపల్ రాజిరెడ్డి మేడం గారిచే మొక్కలు నాటడం, విద్యార్థిని విద్యార్థులకు నోట్బుక్కులు, పెన్నులు పెన్సిళ్లు రబ్బరులు మాగనూరు ఆర్యవైశ్య సంఘం సభ్యులచే, అలాగే ముఖ్యఅతిథి, అతిథులు,మక్తల్ మాజీ డిప్యూటీ గవర్నర్లు, వాసవి క్లబ్ అధ్యక్ష, కార్యదర్శి,కోశాధికారి సభ్యులచే విద్యార్థిని విద్యార్థులకు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ గవర్నర్లు కల్వ శ్రీనివాస్,దొంత నరహరి,కాబినేట్ జాయింట్ ట్రెజరర్ నాగరాజు,కె సి జి ఎఫ్ లు అధ్యక్షులు బిలకంటి నర్సయ్య, మాగనూర్ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు డాక్టర్ జి. కొత్తపల్లి సురేష్ కుమార్, ఉపాధ్యక్షులు ఓబుళశెట్టి నర్సిములు,కార్యదర్శి కళ్యాణం వీరన్న,కోశాధికారులు గుగ్గిళ్ల గిరిదర్ మాగనూర్ మండల ఆర్యవైశ్య సంఘం పెద్దలు ఓబుల్ శెట్టి శివలింగయ్య, ఉదయ్ కుమార్,కొత్త పల్లి వీరయ్య రాంగోపాల్,వాబయ్య, రవి,జగదీష్,నరేందర్, ఎం.రఘు, వర్కుర్ పత్తి కృష్ణయ్య, మందిపల్ సూర్య నారాయణ, వడ్వాట్ కిరణ్,వడ్వాట్ సురేష్,కొల్పూర్ బద్రీనారాయణ,వర్కుర్ నాగేందర్, చిట్టెం వెంకటేష్, కొత్తపల్లి జి. మంజునాథ్,మురళి,వరదరాజులు,వాసవి క్లబ్ అధ్యక్షుడు మేడిశెట్టి హరికృష్ణ, కార్యదర్శి కొత్త ఆంజనేయులు, తాళంపల్లి పవన్ కుమార్,పాఠశాల యాజమాన్యం, విద్యార్థినిలు తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


