గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ 14వ వార్డులో పారిశుధ్య పనులు
గజ్వేల్ (సిద్దిపేట జిల్లా) : సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 14వ వార్డు బిలాల్ మసీదు పరిసరాల్లో మున్సిపల్ సిబ్బందితో మంగళవారం ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో బిలాల్ మసీదు గుమ్మటం చుట్టుపక్కల విపరీతంగా పిచ్చి గడ్డి పెరిగినందున, దోమలు మరియు విషపూరిత పురుగులు వ్యాపించే అవకాశం ఉందని మసీదు కమిటీ సభ్యులు స్థానిక కౌన్సిలర్ గుంటుకు లక్ష్మీ శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై తక్షణమే స్పందించిన కౌన్సిలర్, మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బందిని రంగంలోకి దించారు. వార్డు ప్రజలు ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకొని మసీదు ఆవరణలో పాటు పరిసర ప్రాంతాల్లో గడ్డి మందు, దోమల నివారణ మందు కొట్టించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ గుంటుకు లక్ష్మీ శ్రీనివాస్ మాట్లాడుతూ వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా వార్డు వ్యాప్తంగా ఎప్పటికప్పుడు పారిశుధ్య పనులు చేపడుతున్నామని తెలిపారు. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. సకాలంలో స్పందించి పారిశుధ్య పనులు పూర్తి చేయించినందుకు మసీదు కమిటీ సభ్యులు కౌన్సిలర్ గుంటుకు లక్ష్మీ శ్రీనివాస్ కు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో షకీల్, నవీద్, హజం సలీం, ఆసిఫ్, బాలరాజు, కుమార్, జవాన్ సాయి, తదితరులు పాల్గొన్నారు.
Views: 113
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
28 Jul 2026 18:28:10
గజ్వేల్ (సిద్దిపేట జిల్లా) : శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చరల్ విశ్వవిద్యాలయం, ములుగు, సిద్ధిపేటలోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చరల్ సైన్సెస్ ఆధ్వర్యంలో, పుష్కల్...
