అనాధ శవానికి అంత్యక్రియలు నిర్వహించిన---మానవతా వాదులు..

ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో తేదీ 14.02.2026 న మధ్యాహ్నం 12:00 గంటల ప్రాంతంలో రైల్వే స్టేషన్ అవుట్ గెట్ ముందర గుర్తుతెలియని వ్యక్తి మతిస్థిమితం లేకుండా కిందపడి ఉండగా వెంటనే చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్ కు ఫోన్ చేసి రిమ్స్ ఆస్పత్రికి తీసుకుని రాగా మృతుడు చికిత్స పొందుతూ .. తేదీ 21.2.2026 మధ్యాహ్నం 12:06 నిమిషాలకు చనిపోయారని డాక్టర్లు నిర్ధారించగా అనాధ శవానికి అంతక్రియలు నిర్వహించడానికి ఎవరు ముందుకు రానందున
తేదీ 01.03.2026 ఆదివారం రోజున ఉదయం 10:00 గంటల కు అదిలాబాద్ టూ టౌన్ సీఐ నాగరాజు మరియు ఎస్ఐ అఖిల్, మానవసేవే మాధవ సేవ సమితి సభ్యులకు మరియు బెస్ట్ ఫ్రెండ్స్ హెల్ప్ వెల్పర్ సొసైటీ అబ్దుల్ అజిజ్ కి సమాచారం అందించగా ఈ రోజున మధ్యాహ్నం 03:00 గంటలకు పిట్టల వాడ స్మశాన వాటికలో అనాధ శవానికి అంతక్రియలు నిర్వహించడం జరిగినది ఈ యొక్క కార్యక్రమంలో అబ్దుల్ అజిత్ బెస్ట్ ఫ్రెండ్స్ హెల్ప్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు మానవసేవే మాధవసేవ సమితి సభ్యులు న్యాయవాది శ్రావణ్ నాయక్ , చిందం దేవిదాస్ ,అదిలాబాద్ ట్రాఫిక్ కానిస్టేబుల్ లంక శ్రీనివాస్ , సవిణ్ రెడ్డి రెడ్డి సంఘం రాష్ట్ర ప్రచారక్ రాష్ట్ర నాయకులు & మానవ హక్కుల సంఘం పల్ దే దేవర్ గోపి , వాగ్ మారే దమ్మ కీర్తి కిరణ్ తదితరులు పాల్గొన్నారు
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


