జనగణన రెండో దశను పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్
నాగర్ కర్నూల్ : జనగణన రెండో దశను పకడ్బందీగా నిర్వహించాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్ అధికారులను ఆదేశించారు. జనగణనలో ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా చూడాలని, భారత ప్రభుత్వం నిర్దేశించిన విధివిధానాలను ఖచ్చితంగా పాటించాలని సూచించారు. నాగర్ కర్నూల్ కలెక్టరేట్ లో రెండో దశ జనగణన అధికారులకు రెండు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్, సబ్ కలెక్టర్ సలోని చాబ్రా, అదనపు కలెక్టర్లు కలిసి ప్రారంభించారు. సమాచార సేకరణ, నమోదు ప్రక్రియలో ప్రతి వివరాన్ని జాగ్రత్తగా పరిశీలించాలని, క్షేత్రస్థాయిలో అధికారులు, సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. హైదరాబాద్ శిక్షకులు శివరామకృష్ణ, రిషిత్ రెడ్డి అధికారులకు జనగణన విధివిధానాలపై శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఓ సుజాత, డీఈఓ రమేష్ కుమార్, ఆర్డీవోలు అర్చన, జనార్దన్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


