కామ దహనం మార్చి 2రోజునే,3 న హోలీ జరపాలి.----శ్రీ రామచంద్ర గోపాల కృష్ణ మఠం మాటాధిపతులు శ్రీ శ్రీ శ్రీ యోగానంద సరస్వతి

WhatsApp Image 2026-03-01 at 3.06.44 PM

 

ఆదిలాబాద్ :  ఈ ఏడాది హోలీ పండుగ తేదీల పై నెలకొన్న గందరగోళానికి ఆదిలాబాద్ జిల్లా కేంద్రం లో గల స్థానిక శ్రీ రామచంద్ర గోపాల కృష్ణ మఠం మాటాధిపతులు  శ్రీ శ్రీ శ్రీ యోగానంద సరస్వతి  ప్రజలకు సందేశాన్ని ఇచ్చారు. శ్రీ విజయ్ హనుమాన్ మందిర్ కమిటి సభ్యుల సమావేశం లో ప్రజలకు నెల కొన్న సందిగ్దాన్ని నివృత్తి చేశారు.కామ దహనం మార్చి 2న, రంగుల పండుగ హోలీ గ్రహణ పద్ధతులను అనుసరించి మార్చి 3న జరపాలని  పేర్కొన్నారు. మార్చి 2వ తేదీ సాయంత్రం 5:55 గంటలకు ప్రారంభమయ్యే పూర్ణిమ తిథి, మార్చి 2వ తేదీ సాయంత్రం 5:07 గంటలకు ముగుస్తుందని హిందూ బంధువులు అందరూ గమనించాలని అన్నారు. శాస్త్రం ప్రకారం పౌర్ణమి ఉన్న రోజు సాయంత్రం కామ నిర్వహించి, మరుసటి రోజు రంగులతో హోలీ జరపడం  ఆనవాయితీగా వస్తుంది. హోలీకి ముందు రోజు జరిగే కామ దహనం మార్చి 2వ తేదీన  చేసుకోవాలని శాస్త్రం ప్రకారాం తిథులను బట్టి దీనిని పండితులు నిర్ణయించారన్నారు.ఈ కార్యక్రమం లో విశ్వ హిందూ పరిషద్ అధ్యక్షులు రాజకుమార్, ఆలయ కమిటీ అధ్యక్షులు అరె రవి, సభ్యులు జగదీష్ అగర్వాల్, ఉస్కెమ్ వామన్, జోగు రమేష్, సంజీవ్,తిప్పా గంగన్న,రమేష్ గౌడ్, శ్రీనివాస్, విట్టల్, సంతోష్, సూర్యకాంత్,నవీన్ తదితరులు పాల్గొన్నారు.

Views: 447

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News