నిరు పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ...

బోధన్ : బోధన్ పట్టణంలోని నిరుపేదలకు జమాతే ఇస్లామి హింద్–బోధన్ శాఖ ఆధ్వర్యంలోపవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని రంజాన్ కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం సామాజిక సేవా భావంతో, మతభేదాలకు అతీతంగా నిర్వహించడం విశేషం. ఈ రంజాన్ కిట్లలో బియ్యం, గోధుమలు, పప్పులు, నూనె, చక్కెర, ఖర్జూరాలు వంటి నిత్యావసర సరుకులను చేర్చి, ఉపవాస కాలంలో కుటుంబాలకు ఉపయోగపడే విధంగా సిద్ధం చేశారు. ఈ సందర్భంగా జమాతే ఇస్లామి హింద్ నాయకులు మాట్లాడుతూ రంజాన్ మాసం దానధర్మాలు, సహకారం, సోదరభావాన్ని పెంపొందించే పవిత్ర కాలమన్నారు. సమాజంలోని బలహీన వర్గాలకు అండగా నిలవడం మా బాధ్యత అని పేర్కొన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలను భవిష్యత్తులో కూడా కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు ఎం.డి. మంజూరుద్దీన్, నిజామాబాద్ రూరల్ అధ్యక్షులు అబ్దుల్ జబ్బార్, బోధన్ అధ్యక్షులు అబీద్ హుస్సేన్ ఫారూఖీ, నాయకులు ఆరిఫ్, అమీర్ జమాల్, మిర్జా సలీం బేగ్, షేక్ యూసుఫ్, ఇర్ఫాన్, అబ్దుల్లా, ఎం.డి. ఇర్ఫాన్ అజీజ్ తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


