3కోట్ల ఓట్ చోరీ కాంగ్రెసే - బీజేపీ నాయకులు అబ్బగోని అశోక్ గౌడ్
ఆర్మూర్ రెవెన్యూ డివిజన్ నిజామాబాదు జిల్లా : దేశంలో మూడు కోట్ల ఓట్లు అక్రమ వలసదారులవే వారిలో ఒక్కరికీ ఓటు హక్కు దక్కనివ్వం అని నిజామాబాదు బి. జె. పి నాయకులు అబ్బగోని అశోక్ గౌడ్ అన్నారు. ఇటీవల భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన మహా పాదయాత్రలో భాగంగా బీజేపీ నాయకులు అబ్బగోని అశోక్ గౌడ్ పాల్గొని మా ప్రతినిధి తో వ్యాఖ్యానించారు.కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఎస్‌ఐఆర్ (SIR) ప్రక్రియపై కాంగ్రెస్, ఇండియా కూటమి చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు పాద యాత్రలు చేపడుతున్నట్లు అశోక్ గౌడ్,బి. ఆర్. నర్సింగ్ రావు మాట్లాడుతూ దేశంలోకి చొరబాటుదార్ల ఓట్లతో గెలవాలనుకుంటున్నరనే ఉద్దేశంతో కాంగ్రెస్ ఢిల్లీ ధర్నాతో ప్రజల్ని మోసం చేయడం అనే విషయాన్ని యావత్ ప్రజానికం గమనిస్తున్నారని అన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు, ఎన్నికల వ్యవస్థపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు బీజేపీ చేపడుతున్న కార్యక్రమాలకు ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని వారు బి. జె. పి కార్యకర్తలకు విజ్ఞప్తి చేసారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


