మున్నూరు కాపుల యాప్ను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు ఆకుల బాలయ్య

మున్నూరు కాపుల యాప్ను ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు ఆకుల బాలయ్య

సిద్దిపేట జిల్లా కేంద్రంలో దుబ్బాక మండలం లచ్చపేట గ్రామంలో మున్నూరు కాపు సంఘంలో నిర్వహించిన ఫంక్షన్ హాల్ దుబ్బాక మున్సిపల్ పట్టణ మరియు రూరల్ సమావేశంలో అధ్యక్షుడు ఆకుల బాలయ్య మాట్లాడుతూ నేను చిరు వ్యాపారం చేసుకుంటూ నేను నాకు ఈ జిల్లా అధ్యక్షుని గా బాధ్యత కొండ దేవయ్య అధ్యక్షతన నేను వారి ఆశయాల కనుగుణంగా మున్నూరు కాపు లందరూ ఏకధాటిపై నడిస్తే సాధించలేనిది ఏది లేదంటూ ఇకనుంచి మనందరం ఏకమై ప్రభుత్వానికి దీటుగా మున్నూరు కాపుల ఐక్యత సాటి తిన మాసన్నమైందని మనం చాలా సంకేతక్కువగా ఉండాలి అని ప్రస్తుత ప్రభుత్వము మున్నూరు కాపులకు సరియైన ప్రోత్సహం ఇవ్వడం లేదని ఇట్టి విషయంలో మనందరం మున్నూరు కాపు యాప్ను డౌన్లోడ్ చేసుకొని మన ఐక్యతను చాటాలని ఆయన అన్నారు. ఈసారి రాబోయే అసెంబ్లీ ఎలక్షన్లో మన అందరము ఏకమై రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రిని తీసుకువచ్చే సమయం ఆసన్నమైంది అని మనం మున్నూరు కాపులతోనే సాధ్యమని అన్నారు ఇట్టి విషయంపై మున్నూరు కాపులు అందరూ గ్రామాల పట్టణాలలో ఉన్న వారంతా సంఘటితం కావాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మాజీ జిల్లా అధ్యక్షులు నాయక మల్లయ్య మాట్లాడుతూ నేను సుమారుగా గత 20 25 సంవత్సరాల నుండి మునురుకాపు ఐక్యత కొరకు గ్రామ గ్రామాన ఐక్యంగా చేయడానికి సంఘాల ఏర్పాటు చేసి పట్టణాలలో సంఘాలను ఏర్పాటు చేసి చివరికి నేను పది సంవత్సరాలు సేవ చేసే భాగ్యం కలిగినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది కానీ ఇప్పుడు ఉన్న యువత మరియు పని చేసే వ్యక్తులు ముందుండి ఈ సంఘాన్ని నడిపించాలి దానిలో భాగంగా మన ఆకుల బాలయ్య గారిని జిల్లా అధ్యక్షునిగా చేయడం జరిగింది. ప్రస్తుతానికి ఎలాంటి పదవులు ఆశించకుండా సంఘం కొరకు నిరంతర సేవ చేయడానికి మీ ముందు సేవకునిగా ఉంటానని హామీ ఇస్తున్నాను. సిద్దిపేట జిల్లా మాజీ అధ్యక్షులు మల్లయ్య పట్టణ గ్రామీణ కార్యదర్శి సిరినేని భూషణం కోశాధికారి ఇప్ప దేవరాజ్ ఆకుల రాజయ్య సిద్దిపేట సర్పంచ్ నాగభూషణం జిల్లామీడియా ప్రతినిధి దేవులపల్లి ఎల్లయ్య హంస నాగభూషణం ఆకారం సర్పంచ్ శెట్టి భూపతి ఆకుల శ్రీనివాస్ జిల్లా ఉపాధ్యక్షులు మాజీ సర్పంచ్ శెట్టి శ్రీనివాస్ ఆరెపల్లి సర్పంచ్ కృష్ణంరాజు తో ఆరేపల్లి శెట్టి రాజయ్య అధ్యక్షులుపాటుగా మున్నూరు కాపు సభ్యులందరూ పాల్గొన్నారు

Views: 191

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

మత్తడి వాగు కెనాల్‌కు నీటి ని విడుదల చేసిన  ఎమ్మెల్యే అనిల్ జాదవ్,  ఏఎంసీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి   మత్తడి వాగు కెనాల్‌కు నీటి ని విడుదల చేసిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్, ఏఎంసీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి
ఆదిలాబాద్ బ్యూరో  : రైతుల సాగునీటికోసం ఎదురుచూపులకు తెరదించుతూ తాంసి మండలంలోని మత్తడి వాగు కెనాల్‌కు నీటిని విడుదల చేయడం స్థానిక రైతన్నలకు ఎంతో ఊరటనిచ్చే పరిణామమని...
1న ఆదిలాబాద్ పట్టణంలో జరిగే రైతు గర్జన సభను విజయవంతం చేయాలి - బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, మాజీ ఎమ్మెల్యే జోగు,బాల్కసుమన్
మంత్రులను కలిసిన గంభీరావుపేట ఏఎంసీ చైర్మన్ మరియు పాలక వర్గం
మల్లారం సర్పంచ్ కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు
పీఎం శ్రీ జెడ్పీహెచ్‌ఎస్‌ శివంపేటలో ఈ-వేస్ట్‌పై అవగాహన కార్యక్రమం
శివన్నగూడెం పనులను వెంటనే పూర్తి చేయాలి
న్యూ నలంద పాఠశాలలో ఈ-వేస్ట్ సేకరణ డ్రైవ్