పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపులు ప్రారంభం
2027 పదో తరగతి వార్షిక పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపు షెడ్యూల్ విడుదలైంది. అక్టోబర్ 30 నుంచి పరీక్ష ఫీజు చెల్లింపులకు అవకాశం కల్పిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ఏ. రమేష్ కుమార్ తెలిపారు. నవంబర్ 16 వరకు ఆలస్య రుసుము లేకుండా రూ.125 చెల్లించే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.
ఆలస్య రుసుముల వివరాలు ఇలా ఉన్నాయి:
- నవంబర్ 18 నుంచి డిసెంబర్ 1 వరకు - రూ.50 ఆలస్య రుసుముతో
- డిసెంబర్ 3 నుంచి డిసెంబర్ 14 వరకు - రూ.200 ఆలస్య రుసుముతో
- డిసెంబర్ 16 నుంచి డిసెంబర్ 28 వరకు - రూ.500 ఆలస్య రుసుముతో ఫీజు చెల్లించవచ్చు.
బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వెబ్‌సైట్ ద్వారా ఫీజు చెల్లింపులు చేయాలని, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తమ ఐడీ, పాస్‌వర్డ్‌లతో ఫీజు చెల్లింపు ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. నిర్ణీత గడువులోగా ఫీజు చెల్లించి చివరి నిమిషం ఇబ్బందులు నివారించుకోవాలని, వచ్చే ఏడాది మార్చిలో 2027 పదో తరగతి పబ్లిక్ పరీక్షలు నిర్వహించనున్నట్లు డీఈవో తెలిపారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


