మహాశివరాత్రికి ముస్తాబవుతున్న శివాలయాలు

WhatsApp Image 2026-02-14 at 3.59.07 PM

 

సంగెం :  మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మండలంలోని పలు గ్రామాలలో శివాలయాలు ముస్తాబయ్యాయి. ఈనెల 15న ఆదివారం మహాశివరాత్రి సందర్భంగా ఆలయాలలో శివరాత్రి వేడుకలకు ఆలయాలన్ని పలు గ్రామాల సర్పంచులు, అధికారులు సర్వంగా సుందరంగా ముస్తాబు చేస్తున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పోటెత్తే అవకాశం ఉండడంతో ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. శివరాత్రి రోజున ఉపవాస దీక్షలతో వచ్చే భక్తుల కోసం ఆలయాల వద్ద త్రాగునీరు, చలవ పందిళ్లు, లైటింగ్  క్యూలు  ఏర్పాటు చేస్తున్నారు. కార్పొరేట్ల తో పాటు ఆలయాల చుట్టూ విద్యుత్తు దీపాలతో అందంగా ముస్తాబు చేశారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. శివరాత్రి ఉత్సవాల సందర్భంగా భారీగా భక్తులు తరలివస్తారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు అభిషేకాలు జరిపిస్తారు. వేల సంఖ్యలో శివ పార్వతుల కళ్యాణం మహోత్సవాన్ని తిలకిస్తారు. పలు ఆలయాల ఆవరణలో భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేయనున్న కాఫీ, టీ, చిన్న పిల్లల బొమ్మలు, చిత్రపటాలు, మిఠాయిలు, తదితరాలు విక్రయించే స్టాళ్ల ఏర్పాటు, భక్తుల వాహనాల పార్కింగ్ కు పంచాయితీ సిబ్బందితో ఆలయం వెలుపల ఉన్న స్థలాలను యంత్రాలతో చదును చేస్తున్నారు. శివరాత్రికి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని అంచనాతో ఆలయాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు పనుల్లో నిమగ్నమయ్యారు. ప్రత్యేక పార్కింగ్, పోలీసు బందోబస్తును ఏర్పాటు చేయనున్నారు.

Views: 168

About The Author

Vision Andhra Telugu Daily Picture

Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry. Lorem Ipsum has been the industry's standard dummy text ever since the 1500s, when an unknown printer took a galley of type and scrambled it to make a type specimen book. It has survived not only five centuries, but also the leap into electronic typesetting, remaining essentially unchanged. It was popularised in the 1960s with the release of Letraset sheets containing Lorem Ipsum passages, and more recently with desktop publishing software like Aldus PageMaker including versions of Lorem Ipsum.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

జగిత్యాల సీఎం కప్‌లో నూకపల్లి మోడల్ స్కూల్ విద్యార్థిని ప్రభంజనం! జగిత్యాల సీఎం కప్‌లో నూకపల్లి మోడల్ స్కూల్ విద్యార్థిని ప్రభంజనం!
    మల్యాల  : శనివారం రోజున జగిత్యాల జిల్లా కేంద్రంలోని స్వామి వివేకానంద స్టేడియంలో జగిత్యాల జిల్లా స్థాయి సీఎం కప్  ఆటల పోటీలలో అండర్-18 షాట్
ఝరి బి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించిన ఏఎంసీ చైర్మన్
జన విజ్ఞాన వేదిక వార్షికోత్సవంలో పాల్గొన్న అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ
శివరాత్రి సందర్బంగా మర్పల్లిలో పండ్ల కొట్టుల సందడి
జాతర ఏర్పాట్లను పరిశీలించిన అడిషనల్ కలెక్టర్ నగేష్ పెద్ద ఎత్తున భక్తులు పాల్గొంటారని అంచనా
అచ్చంపేట ఏరియా ఆసుపత్రిలో వైద్యులతో సమీక్ష సమావేశం నిర్వహించిన అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ
కాకతీయుల కళావైభవం... నాగులపహాడ్ శివాలయం