గోదావరి వరదల్లో సిఐ రాజు వర్మ , ఎస్ ఐ నర్సిరెడ్డి సాహస యాత్ర
- తహసిల్దార్ బృందం 15 మంది రక్షించగా
- సిఐ రాజు వర్మ 30 మందిని రక్షించేందుకు, స్వయంగా రంగంలోకి.
చర్ల ,(భద్రాద్రి కొత్తగూడెం): మండలంలోని వీరాపురం గోదావరి ఇసుక ర్యాంపు వద్ద అకస్మాత్తుగా పెరిగిన వరద ఉధృతితో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇసుక లోడింగ్ పనుల్లో ఉన్న కార్మికులు మధ్యలో చిక్కుకోవడంతో తీవ్ర భయాందోళనలు తలెత్తాయి. సమాచారం అందిన వెంటనే స్థానిక తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో ఈదయ్య, ఎస్ఐ నర్సిరెడ్డిలతో కలిసి సీఐ రాజు వర్మ ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా లైఫ్ జాకెట్లతో మొదటి విడతలో 15 మంది కార్మికులను సురక్షితంగా తహసిల్దార్ కార్యాలయ బృందం సహాయంతో రక్షించారు. అంతటితో ఆగకుండా, అవతల లంక ప్రాంతంలో చిక్కుకున్న మరో ముప్పై మందికి పైగా లారీ డ్రైవర్లు, పశువుల కాపర్లను రక్షించేందుకు సీఐ రాజు వర్మ తెప్పపై సాహస యాత్ర చేశారు, వరద తీవ్రతకు సిఐ రాజు వర్మ ఎక్కిన తెప్ప కొంతమేరా కొట్టుకుపోయినా చాకచక్యంగా వ్యవహరించి లంకలోకి చేరుకుని సిఐ రాజు వర్మ , ఎస్ ఐ నర్సిరెడ్డి లు అందరికి ధైర్యం ఇవతలి ఒడ్డు కు వెళ్లాలని హితవు చేశారు, అధికారుల సమన్వయం, పోలీసుల తెగువతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఏడాది వరదలు మునుపటి కంటే ఉధృతంగా ఉండే అవకాశం ఉన్నందున, ఇసుక ర్యాంపుల్లోని గోతుల వల్ల ప్రమాదాలు పొంచి ఉన్నాయని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, ఈ నేపథ్యంలో ఎవరూ ఈతకు, చేపల వేటకు వెళ్లవద్దని, ప్రయాణ సమయాల్లో విధిగా లైఫ్ జాకెట్లు ధరించాలని జిల్లా కలెక్టర్ అంకిత్, సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ట హెచ్చరిస్తున్నారు.
Views: 6
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
31 Jul 2026 18:20:28
వరంగల్ / నర్సంపేట : తెలంగాణ ఉద్యమ క్షేత్రంలో.. నర్సంపేట రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన కీలక నేత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అకాల...
