నూతన గ్రంథాలయ భవనానికి ఘనంగా శంకుస్థాపన
టేకులపల్లి, (భద్రాద్రి కొత్తగూడెం జిల్లా): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండల కేంద్రంలో నూతన గ్రంథాలయ భవన నిర్మాణానికి శుక్రవారం ఘనంగా శంకుస్థాపన జరిగింది. రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి, ఇల్లందు నియోజకవర్గ ఎమ్మెల్యే కోరం కనకయ్య సంయుక్తంగా శంకుస్థాపన చేసి నిర్మాణ పనులను ప్రారంభించారు. కార్యక్రమంలో ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ రాహుల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రజాప్రతినిధులు, గ్రంథాలయాలు సమాజ అభివృద్ధికి, విద్యార్థుల విజ్ఞాన వికాసానికి, యువత పోటీ పరీక్షల సన్నద్ధతకు కీలకమైన విజ్ఞాన కేంద్రాలు అని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆధునిక గ్రంథాలయాల ఏర్పాటు ద్వారా విద్యార్థులు, ఉద్యోగార్థులు, యువత, పుస్తక ప్రియులకు మెరుగైన అవకాశాలు లభిస్తాయని తెలిపారు. ప్రజలకు నాణ్యమైన విద్యా వాతావరణాన్ని కల్పించాలనే లక్ష్యంతో ఈ నూతన భవన నిర్మాణాన్ని చేపట్టామని, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఆధునిక సౌకర్యాలతో గ్రంథాలయాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వీరబాబు, తహసీల్దార్ (ఎంఆర్వో) వీరభద్రం, ఎంపీడీఓ శ్రీదేవి, ఆత్మ కమిటీ చైర్మన్ మంగీలాల్, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు ఖాదర్ బాబు, ప్రధాన కార్యదర్శి కాలే ప్రసాద్, నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు కోరం సురేందర్, జిల్లా గ్రంథాలయ సంస్థ అధికారులు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, యువతతో పాటు పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజలు హాజరయ్యారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


