జిల్లా కలెక్టర్‌ను కలిసిన జీపీటీఏ జిల్లా కమిటీ

జిల్లా కలెక్టర్‌ను కలిసిన జీపీటీఏ జిల్లా కమిటీ


చౌటకూర్ : చౌటకూర్ మండల కేంద్రంలో గ్రామపంచాయతీ అధికారి (జీపీఓ)పై జరిగిన దాడి ఘటనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జీపీటీఏ (గ్రామపంచాయతీ అధికారుల సంఘం) సంగారెడ్డి జిల్లా కమిటీ ప్రతినిధులు జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా దాడి ఘటనపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు కలెక్టర్‌ను కోరారు. గ్రామపంచాయతీ అధికారులకు భద్రత కల్పించడంతో పాటు విధుల నిర్వహణకు అనుకూల వాతావరణం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో జీపీటీఏ జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి బి. లక్ష్మణ్, జిల్లా ఉపాధ్యక్షురాలు బి. మల్లేశ్వరి, జిల్లా సహాయ కార్యదర్శులు టి.నాగరాజు, కె.శివరామకృష్ణ, ఎం.చంద్రశేఖర్, అధ్యక్షుడు శ్రీనివాస్, నారాయణ, వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.

Views: 2

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

బీటలువారిన నేల... పెద్దమ్మ తల్లి సన్నిధిలో జలాభిషేకం బీటలువారిన నేల... పెద్దమ్మ తల్లి సన్నిధిలో జలాభిషేకం
మర్పల్లి,(వికారాబాద్): మండలంలో వర్షాభావ పరిస్థితులు రోజురోజుకూ తీవ్రరూపం దాల్చడంతో అన్నదాతల ఆవేదన తారాస్థాయికి చేరుకుంది. సకాలంలో వర్షాలు కురవకపోవడంతో రైతులు ఎంతో ఆశతో సాగు చేసిన పత్తి,...
ఈ నెల 31లోపు రేషన్ కార్డుల ఈ-కేవైసీ పూర్తి చేయాలి
నర్సరీని సందర్శించిన డీఎల్పీఓ చందన
ఆర్‌ఓ ప్లాంట్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే నాయిని...
కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి.
విద్యారంగంపై ప్రభుత్వానికి శ్రద్ధ లేదు
చౌటకూర్ గ్రామంలో వ్యవసాయ అవగాహన కార్యక్రమం నిర్వహణ