ప్రజల సమస్యలను పరిష్కరించడంలో అధికారులు నిర్లక్ష్యం వహించవద్దు
- అచ్చంపేట మండలం సర్వసభ్య సమావేశంలో అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ
- అధికారులు సర్పంచులు సమన్వయంతో పని చేయాలి
- పంచాయతీ కార్యదర్శులు ప్రజలకు అందుబాటులో ఉండాలి
అచ్చంపేట : గ్రామాలలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అధికారులు నిర్లక్ష్యం వహించవద్దని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ అన్నారు శుక్రవారం అచ్చంపేట పట్టణంలో అచ్చంపేట మండల సాధారణ సర్వ సభ్య సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో సర్పంచులు అన్ని శాఖలకు సంబంధించిన అధికారులు పాల్గొనగా గ్రామాలలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారులు ఎలా పరిష్కరించాలి గ్రామాల అభివృద్ధికి ఏ విధంగా తోడ్పడాలని పలు అంశాలపై సమావేశంలో చర్చ జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ మాట్లాడుతూ మండలంలో ప్రజల సమస్యల పరిష్కారం చేస్తూ అచ్చంపేట మండలం అభివృద్ధికి తోడ్పాటు అందించాలని అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాల సమర్థవంతమైన అమలు లక్ష్యంగా అధికారులు సర్పంచులు పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు గ్రామాల అభివృద్ధికి సర్పంచులు అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని అన్నారు పంచాయతీ కార్యదర్శులు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యలను సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఆదేశించారు మండలంలో ఉన్నటువంటి వివిధ సమస్యల పైన సమావేశంలో చర్చించడం జరిగింది ప్రధానంగా గ్రామాలలో తాగునీటి సమస్య విద్యుత్తు డ్రైనేజీ మిషన్ భగీరథ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం తదితర విషయాలలో ప్రజాప్రతినిధులు అధికారులు సమన్వయంతో పనిచేసి అభివృద్ధికి సహకరించాలని ఎమ్మెల్యే కోరారు ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు వివిధ గ్రామాల సర్పంచులు తదితరులు పాల్గొన్నారు
Views: 1
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
31 Jul 2026 18:20:28
వరంగల్ / నర్సంపేట : తెలంగాణ ఉద్యమ క్షేత్రంలో.. నర్సంపేట రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన కీలక నేత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అకాల...
