ఏప్రిల్ 17,18 తేదీలలోడిహెచ్ పిఎస్ రెండవ రాష్ట్ర మహాసభలు డీహెచ్ పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుపాక అనిల్

 WhatsApp Image 2026-02-27 at 3.52.04 PM

 

హనుమకొండ: తెలంగాణ రాష్ట్రంలో దళితుల హక్కుల పరిరక్షణ, రాజ్యాంగ విలువల కాపాడటం, సామాజిక న్యాయం సాధన లక్ష్యంగా దళిత హక్కుల పోరాట సమితి (డి హెచ్ పిఎస్) రెండవ రాష్ట్ర మహాసభలను 2026 ఏప్రిల్ 17, 18 తేదీలలో వరంగల్ నగరంలో నిర్వహించనుందని దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుపాక అనిల్ కుమార్ తెలిపారు. డిహెచ్ పిఎస్ హనుమకొండ, వరంగల్ జిల్లాల సంయుక్త సమావేశం  నిమ్మల మనోహర్ అధ్యక్షతన హనుమకొండ బాలసముద్రంలోని సీపీఐ జిల్లా జిల్లా కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన మారుపాక అనిల్ కుమార్ మాట్లాడుతూ భారత రాజ్యాంగం దేశంలోని ప్రతి పౌరుడికి సమాన హక్కులు, సమాన అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో రూపుదిద్దుకుందని, రాజ్యాంగ   నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సామాజిక న్యాయం, సమానత్వం, స్వేచ్ఛ,  రాజ్యాంగ పునాదులుగా ప్రతిపాదించారని  అయితే ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో రాజ్యాంగ సంస్థలు బలహీనపరచబడుతున్నాయనే ఆందోళనలు పెరుగుతున్నాయన్నారు. దళితులపై దాడులు, కులవివక్ష, భూమి సమస్యలు, విద్యా హక్కుల  వంటి ఘటనలు రాజ్యాంగ ఆత్మకు విరుద్ధంగా జరుగుతున్నాయని,రాజ్యాంగ పరిరక్షణ కేవలం న్యాయపరమైన అంశం కాదని, అది సామాజిక ఉద్యమం,దళితులపై జరిగే ప్రతి అన్యాయానికి వ్యతిరేకంగా సమిష్టిగా పోరాడటమే రాజ్యాంగ పరిరక్షణకు కోసం ఈ మహాసభల్లో రాజ్యాంగ రక్షణకు రాష్ట్ర స్థాయి కార్యాచరణ ప్రణాళిక రూపొందించబడుతుందన్నారు. 
సామాజిక న్యాయం అంటే వనరుల సమాన పంపిణీ, విద్య–ఉపాధిలో సమాన భాగస్వామ్యం, గౌరవప్రద జీవన హక్కు అని,ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో దళితులపై అగ్రకుల పెత్తందారుల దౌర్జన్యాలు కొనసాగుతూనే ఉన్నాని, భూమి ఆక్రమణలు, సామాజిక బహిష్కరణలు, అఘాయిత్యాలు చోటుచేసుకుంటున్నాయని,ఈ పరిస్థితుల్లో సామాజిక న్యాయం సాధన కోసం బలమైన సంఘటిత ఉద్యమం అవసరం అన్నారు.దళిత బడ్జెట్ కేటాయింపులు పూర్తి స్థాయిలో ఖర్చు కావడం లేదు. ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను ఇతర అవసరాలకు మళ్లించడం ఆపాలి. విద్య, ఆరోమళ్లించని, నిర్మాణం, స్వయం ఉపాధి రంగాల్లో ప్రత్యేక పథకాలు సమర్థవంతంగా అమలు చేయాలన్నారు.ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ వేగంగా జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగాల సంఖ్య తగ్గుతోందన్నాకు. దాంతో రాజ్యాంగబద్ధ రిజర్వేషన్ హక్కులు క్రమంగా క్షీణిస్తున్నాయి. ఈ పరిస్థితిలో ప్రైవేటు రంగాల్లో రిజర్వేషన్లు అమలు చేయడం అత్యవసరం. పెద్ద కార్పొరేట్ సంస్థలు, పరిశ్రమలు, విద్యా సంస్థల్లో సామాజిక న్యాయం సూత్రం అమలు కావాలని,దళిత యువతకు నైపుణ్యాభివృద్ధి, ఉపాధి హామీ ప్రోత్సాహం వంటి అంశాల్లో ప్రభుత్వాలు స్పష్టమైన విధానాలు ప్రకటించాలి. ఏప్రిల్ 17 ,18న వరంగల్ నగరంలో జరిగే డి హెచ్ పి ఎస్ రాష్ట్ర రెండవ మహాసభలకు వ్యాపార, వాణిజ్య రంగాలకు చెందిన ప్రముఖులు సహాయ, సహకారా లు  ఈ మహాసభల విజయవంతలకు సహకరించవలసిందిగా తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ పక్షాన విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో సీపీఐ జిల్లా  సహాయ కార్యదర్శి మద్దెల మల్లేష్, జిల్లా కార్యవర్గ సభ్యులు మునగాల బిక్షపతి, కొట్టేపాక రవి, రొంటాల దేవా, జన్ను రవి, జాన్ పాల్, బత్తుల సుప్రియ, రత్నం, దేవన్న తదితరులు పాల్గొన్నారు.

Views: 10

About The Author

Vision Andhra Telugu Daily Picture

Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry. Lorem Ipsum has been the industry's standard dummy text ever since the 1500s, when an unknown printer took a galley of type and scrambled it to make a type specimen book. It has survived not only five centuries, but also the leap into electronic typesetting, remaining essentially unchanged. It was popularised in the 1960s with the release of Letraset sheets containing Lorem Ipsum passages, and more recently with desktop publishing software like Aldus PageMaker including versions of Lorem Ipsum.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ఉమ్మడి ఖమ్మం జిల్లా చైర్మన్ గా పసుపులేటి నాసరయ్య ఉమ్మడి ఖమ్మం జిల్లా చైర్మన్ గా పసుపులేటి నాసరయ్య
    ఖమ్మం   : తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఉమ్మడి ఖమ్మం జిల్లా చైర్మన్ గా పసుపులేటి నాసరయ్య ను ఎన్నికచేస్తూ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు
రాష్ట్ర కార్యదర్శి గా డాక్టర్ కే.వి.కృష్ణారావు ఎన్నిక..
“అరైవ్ ఆలైవ్” కార్యక్రమంలో భాగంగా కోరుట్లలో డ్రైవర్లకు ఉచిత కంటి వైద్య శిబిరం...
సివిల్ సప్లైస్ డీఎం కృష్ణవేణి ని మర్యాదపూర్వకంగా కలిసిన రైస్ మిల్లర్స్ అసోసియేషన్ సభ్యులు.
బెల్లంపల్లిలో వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ సమావేశం నిర్వహణ
వివేక్ వెంకటస్వామి సమక్షంలో 50 మంది కార్యకర్తల చేరిక
మాదిగ హక్కుల దండోరా 6వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు