దేశం కోసమే నేతాజీ జీవితం అంకితం : ఉప సర్పంచ్ గుమ్మడి సంపత్

సంగెం : మండలంలోని గవిచర్ల గ్రామంలో హింద్ పౌజ్ వ్యవస్థాపకుడు, స్వతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 129వ జయంతి పురస్కరించుకొని శుక్రవారం సర్పంచ్ భాషిపాక సదయ్య ఆదేశాల మేరకు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఉప సర్పంచ్ గుమ్మడి సంపత్ మాట్లాడుతూ నేతాజీ తన జీవితాన్నంత దేశం కోసం అంకితం చేశారని కొనియాడారు. స్వతంత్ర సమరయోధులు నేతాజీ సుభాష్ చంద్రబోస్ సేవలు మరువలేనివని, నేటి యువతకు ఆదర్శనీయమన్నారు. సుభాష్ చంద్రబోస్ జయంతే కానీ వర్ధంతి లేని మహావీరుడు అని నాకు రక్తాన్ని ఇవ్వండి.. నేను మీకు స్వతంత్రాన్ని ఇస్తాను అంటూ స్వతంత్రం కోసం పోరాడిన భారతదేశ కీర్తి కిరీటం మరణం లేని అమరుడు. భారత్ కు ఆయుధాలతో పోరాటం తెలుసని ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నతుడు సుభాష్ చంద్రబోస్ అని కొనియాడారు. అనంతరం పంచాయతీ కార్యదర్శి శరత్ కుమార్ మాట్లాడుతూ స్వతంత్ర పోరాటం అనే యుద్ధంలో పోరాడిన సుభాష్ చంద్రబోస్ నేతాజీగా భారతీయుల హృదయాలలో నిలిచిపోయిన మహానుభావుడని కీర్తించారు. నేతాజీ స్వతంత్రం కోసం తన రక్తం ధారపోసిన భారత స్వతంత్ర సమర యోధుడని, స్వతంత్ర పోరాటం అహింస మార్గంలోనే కాదు వీరం మార్గంలోనూ బ్రీటర్లపై పోరాడుదమని పిలుపునిచ్చిన మహావీరుడు. సాయుధ పోరాటం ద్వారా ఆంగ్లేయులను దేశం నుంచి తరిమి కొట్టవచ్చునని నమ్మి అది ఆచరణలో పెట్టిన యోధుడు సుభాష్ చంద్రబోస్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ భాషిపాక అశోక్, వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ అచ్చ నాగరాజు, గ్రామపంచాయతీ సిబ్బంది, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
About The Author
Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry. Lorem Ipsum has been the industry's standard dummy text ever since the 1500s, when an unknown printer took a galley of type and scrambled it to make a type specimen book. It has survived not only five centuries, but also the leap into electronic typesetting, remaining essentially unchanged. It was popularised in the 1960s with the release of Letraset sheets containing Lorem Ipsum passages, and more recently with desktop publishing software like Aldus PageMaker including versions of Lorem Ipsum.


