మేడారం పరిరక్షణ ధ్యేయం

హనుమకొండ : హనుమకొండ కలెక్టరేట్ ఎదుట ప్రపంచ పర్యావరణ సంస్థ ఆధ్వర్యంలో మేడారం పరిరక్షణ కోసం 22 భాషల భారీ బ్యానర్‌తో నిర్వహించిన వినూత్న అవగాహన ర్యాలీలో పాల్గొన్న జిల్లా అదనపు కలెక్టర్ ఎన్. రవి, సామాజిక వేత్తలు ఇ.వి. శ్రీనివాస్ రావు, డాక్టర్ సి.హెచ్. భద్ర తదితరులు. మేడారం మహాజాతర పవిత్రతను, అక్కడి అటవీ సంపదను పరిరక్షించడమే లక్ష్యంగా ప్రపంచ పర్యావరణ సంస్థ (వరల్డ్ ఎన్విరాన్మెంట్ ఆర్గనైజషన్) ఆధ్వర్యంలో గురువారం హనుమకొండ కలెక్టరేట్ కార్యాలయం ఎదుట భారీ అవగాహన ర్యాలీతో పాటు ప్రతిజ్ఞా కార్యక్రమాన్ని నిర్వహించారు.
పర్యావరణ పరిరక్షణ కోసం భారత రాజ్యాంగం గుర్తించిన 22 భాషల్లో రూపొందించిన భారీ క్లాత్ బ్యానర్ ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్లాస్టిక్ రహిత మేడారం కోసం ఇచ్చిన సందేశం ప్రజలను ఆలోచింపజేసింది.ముఖ్య అతిథిగా జిల్లా అదనపు కలెక్టర్ ఎన్. రవి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ ఎన్. రవి పాల్గొని, పర్యావరణ పరిరక్షణ కోసం చేపడుతున్న ఈ తరహా వినూత్న కార్యక్రమాలను అభినందించారు. మేడారం వంటి పవిత్ర ప్రాంతాల్లో ప్రజల సహకారంతోనే ప్లాస్టిక్ నియంత్రణ సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు.
ప్లాస్టిక్ రహిత మేడారం జాతరకు పిలుపు
ఈ నెల 28 నుండి 31 వరకు ములుగు జిల్లా తాడువాయి మండలంలో జరగనున్న ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర అయిన మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరను పూర్తిగా ‘ప్లాస్టిక్ రహిత’ జాతరగా మార్చాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని సామాజికవేత్త, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇ.వి. శ్రీనివాస్ రావు మరియు ప్రపంచ పర్యావరణ సంస్థ జాతీయ కార్యదర్శి సాగర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. భక్తులు అడవిని, అటవీ జీవ వైవిధ్యాన్ని కాపాడాలని, ప్లాస్టిక్ కవర్లు, బాటిళ్లు అడవిలో వదిలివేయకూడదని కోరారు.
అంతర్జాతీయ గుర్తింపు దిశగా ప్రయత్నం
ఈ సందర్భంగా ప్రపంచ పర్యావరణ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ సి.హెచ్. భద్ర మాట్లాడుతూ
“గత 14 సంవత్సరాలుగా మా సంస్థ మేడారంలో ప్లాస్టిక్ నియంత్రణ కోసం నిరంతరం పనిచేస్తోంది. ఈసారి జాతరకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావాలనే లక్ష్యంతో, పర్యావరణానికి హాని చేయని వస్త్రంతో 22 భాషల్లో నినాదాలు రాసిన భారీ బ్యానర్‌ను రూపొందించాం. ఇది చరిత్రలో నిలిచిపోతుంది” అని అన్నారు. కోట్లాది ప్లాస్టిక్ వ్యర్థాలతో మేడారానికి ముప్పు ఇ.వి. శ్రీనివాస్ రావు మాట్లాడుతూ
“ఈసారి జాతరకు సుమారు 2.5 నుంచి 3 కోట్ల మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది. ఒక్కొక్కరు సగటున 10–20 ప్లాస్టిక్ కవర్లు లేదా బాటిళ్లు వాడితే, 10 నుంచి 15 కోట్ల ప్లాస్టిక్ వ్యర్థాలు అడవిలో చేరే ప్రమాదం ఉంది. ఇది మేడారం అడవిని కాలుష్య కాసారంగా మారుస్తుంది. భక్తులు బాధ్యతగా ప్లాస్టిక్‌ను త్యజించి అడవి తల్లిని కాపాడితేనే మన భవిష్యత్తు సురక్షితంగా ఉంటుంది” అని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల నినాదాలతో మారుమోగిన ప్రాంతం ఈ ర్యాలీలో కాకతీయ పాఠశాల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని “సేవ్ మేడారం – క్లీన్ మేడారం – గ్రీన్ మేడారం ” అంటూ నినాదాలు చేయగా, ఆ ప్రాంతమంతా పర్యావరణ సందేశంతో మారుమోగింది. పాల్గొన్న ప్రముఖులు
ఈ కార్యక్రమంలో కాజీపేట ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ పిట్టల వెంకన్న, ప్రపంచ పర్యావరణ సంస్థ కార్యవర్గ సభ్యులు శ్రీనివాస్ పటేల్, జాతీయ యువజన కార్యదర్శి సుమెర్, కాంగ్రెస్ నాయకులు ఏనుగుల రాంప్రసాద్,దయాప్రసాద్, సామాజిక కార్యకర్త చంద్రప్రకాష్, జనగామ జిల్లా అధ్యక్షుడు నీలం యువరాజ్, రోషన్ గైక్వాడ్, బాగడి రమేష్, అనికేత్, సంస్థ అంబాసిడర్ అద్విత్ తదితరులు పాల్గొన్నారు.
About The Author
Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry. Lorem Ipsum has been the industry's standard dummy text ever since the 1500s, when an unknown printer took a galley of type and scrambled it to make a type specimen book. It has survived not only five centuries, but also the leap into electronic typesetting, remaining essentially unchanged. It was popularised in the 1960s with the release of Letraset sheets containing Lorem Ipsum passages, and more recently with desktop publishing software like Aldus PageMaker including versions of Lorem Ipsum.

Related Posts

