ముల్కనూరులో లో ఉచిత మెగా వైద్య శిబిరం
వైద్య శిబిరాన్ని సందర్శించి న హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్

హన్మకొండ : రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకు హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్క నూర్ లో నిర్వహిస్తున్న ఉచిత మెగా వైద్య శిబిరాన్ని కలెక్టర్ స్నేహ శబరీష్ సందర్శించారు. హనుమకొండ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, జనగామ ప్రభుత్వ వైద్య కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో భీమదేవరపల్లి మండల ప్రజల కోసం స్థానిక మోడల్ స్కూల్లో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ సందర్శించారు. మెగా వైద్య శిబిరంలో ఓపి నమోదు, ,ప్రాథమిక పరీక్షల కౌంటర్లను ,కలెక్టర్ పరిశీలించారు. జనరల్ ఫిజీషియన్ విభాగాలతోపాటు ఎముకలు, శస్త్ర చికిత్స, పిల్లలు, చెవి ముక్కు గొంతు, చర్మవ్యాధి, కంటి, స్త్రీ వైద్య నిపుణులు వైద్య సేవలను , ఈసీజీ మరియు ఎక్సరే పరీక్షలు నిర్వహిస్తుండగా కలెక్టర్ సందర్శించి ఆయా విభాగాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఫార్మసీ కౌంటర్ ను కలెక్టర్ సందర్శించి అందుబాటులో ఉన్న మందులను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ ప్రజలకు అవసరమైన వైద్య సేవలను అందించాలని వైద్యులకు సూచించారు. అలాగే హాజరైన సర్పంచులను వారి వారి గ్రామాల నుండి ఎంతమంది ఏ సమస్యలతో రావడం జరిగిందో అడిగి తెలుసుకున్నారు. జనగామ వైద్య కళాశాల, జిల్లా ఆసుపత్రి జనగామకు చెందిన (8 )విభాగాల నుండి స్పెషలిస్ట్ వైద్యులు ఉచిత మెగా వైద్య శిబిరంలో పాల్గొని ప్రజలకు వైద్య సేవలు అందించారు.
ముల్కనూర్ ,వంగర ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోని డాక్టర్లు ఏఎన్ఎంలు, ఆశా లు , మహిళా సమాఖ్య సభ్యులు , గ్రామ కార్యదర్శులు సంబంధిత గ్రామ ప్రజలను గుర్తించి శిబిరానికి పంపించగా వివిధ విభాగాల వైద్యులు పరీక్షించారు. ఈ శిబిరంలో 14 మంది స్పెషలిస్ట్ వైద్యులు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ నుండి డాక్టర్లు సూపర్వైజర్లు,ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మసీ ఆఫీసర్లు , రేడియోగ్రాఫర్లుపారామెడికల్ సిబ్బంది , ఏఎన్ఎంలు ఆశా కార్యకర్తలు మొత్తం (75)మందిలపాల్గొన్నారు. అలాగే ప్రజలకు వివిధ ఆరోగ్య అంశాల పట్ల, ప్రభుత్వం చేపడుతున్న ఆరోగ్య కార్యక్రమాలకు సంబంధించిన అవగాహన ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరికి బీపీ తో పాటు అవసరమైన వారికి షుగర్ , హిమోగ్లోబిన్ పరీక్షలను అక్కడే నిర్వహించగా ఇతర ల్యాబ్ పరీక్షలకు నమూనాలు సేకరించి తెలంగాణ డయాగ్నొస్టిక్ హబ్ లో పరీక్షల నిమిత్తం పంపించారు. ప్రత్యేకంగా మొబైల్ ఎక్స్రే మరియు ఈసీజి ఏర్పాటు చేయడం జరిగింది
ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని , స్థానికంగా అందుతున్న వైద్యంతో పాటు, స్పెషలిస్ట్ వైద్య సేవలు అవసరం ఉండి పనుల ఒత్తిడి వల్ల అలాగే వైద్య పరీక్షలకుటెస్టులకు అదనంగా డబ్బులు వెచ్చించలేక పట్టణాలకు వెళ్లలేక పోతున్న వారి కోసం మండల కేంద్రంలో వారికి అందుబాటులో వైద్య సేవలు అందించాలని ఉద్దేశ్యంతో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో (310)మందికి ఒక్కరికి దాదాపుగా 1800 రూపాయల విలువైన ల్యాబ్ పరీక్షలు చేయడం జరిగింది.5 లక్షల పైగా విలువచేసే మందులను పంపిణీ చేయడం జరిగింది. డి ఎం హెచ్ ఓ విజ్ఞప్తి మేరకుజిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ అసోసియేషన్ అధ్యక్షులు మృత్యుంజయ రెడ్డి దాదాపుగా ఒక లక్షరూపాయల విలువైన మందులు అందించడం జరిగింది.
మొత్తం వైద్య శిబిరంలో ( 863)వైద్య సేవలు అందుకోగా అందులో జనరల్ మెడిసిన్ (. 284)ఎముకలవైద్యానికి సంబంధించి ( 143)పిల్లలకు సంబంధించిన సమస్యలు ( 93)చర్మవ్యాధి సమస్యలు ( 44)చెవి ముక్కు గొంతు సంబంధిత సమస్యలు ( 49)జనరల్ సర్జరీ ( 26)స్త్రీలకు సంబంధించిన సమస్యలు(.34)కంటి సమస్యలకు (190)చికిత్స అందించడం జరిగింది. అలాగే మరింత మెరుగైన పరీక్షలు చికిత్స నిమిత్తం (12 ) మందిని ఎంజీఎం ఆసుపత్రి, జిఎంహెచ్ లకు (18) క్యాటరాక్ట్ ఆపరేషన్ నిమిత్తంలరిఫర్ చేయడం జరిగింది . (89 ) ఎక్స్ రే మరియు (40) ఈసీజీ పరీక్షలు. లాబ్ పరీక్షలు (310)నిర్వహించడం జరిగిందని డీఎంహెచ్ఓ డాక్టర్ ఏ.అప్పయ్య తెలియజేశారు. దృష్టిలోపాలున్న (54) మంది కి పెద్ది వసంత ఫౌండేషన్ ద్వారా అద్దాలు అందజేయడం. జరుగుతుందని పెద్ది వెంకటనారాయణ గౌడ్ తెలియజేశారు
ఈ కార్యక్రమంలో డిఎంహెచ్వో డాక్టర్ ఏ అప్పయ్య, స్థానిక సర్పంచ్ . ప్రమోద్ రెడ్డి, ఉప సర్పంచ్ కే.మమత, రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ పెద్ది వెంకటనారాయణ గౌడ్, వంగర సర్పంచ్ గజ్జల సృజన రమేష్, ఎర్రబెల్లి సర్పంచ్ కాలేరు శ్రవణ్ విశ్వనాథ కాలనీ సర్పంచ్ కస్తూరి సుధాకర్, ధర్మారం సర్పంచి గోపగోని తిరుపతి, జిల్లా టీబీ నియంత్రణ అధికారి డాక్టర్ హిమబిందు, స్థానిక తహసిల్దార్ రాజేష్ ఎంపీడీవో వీరేశం ,జనగామ నుండి డాక్టర్ డాక్టర్ సంజీవయ్య,. డాక్టర్ హైమావతి డాక్టర్ సుప్రియ ,డాక్టర్ శ్వేత డాక్టర్ మానస్ , డాక్టర్ ఉదయ్. డాక్టర్ సుష్మ డాక్టర్ ప్రశాంత్ ,, డాక్టర్ వర్షిణి, ముల్కనూరు, వంగర ఎల్కతుర్తివైద్యాధికారులు డాక్టర్ స్వప్న ,డాక్టర్ రెహమాన్ ,డాక్టర్ రాజశేఖర్ , డాక్టర్ భార్గవ్ డాక్టర్ సురేష్,, పల్లెదవ ఖానా వైద్యాధికారులు, మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ శ్రీ రెహమాన్ ,డెమో వి అశోక్ రెడ్డి , హెచ్ ఓ డి లువరాజేశ్వర్ రెడ్డి మోహన్,అధికారులు పాల్గొన్నారు.
About The Author
Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry. Lorem Ipsum has been the industry's standard dummy text ever since the 1500s, when an unknown printer took a galley of type and scrambled it to make a type specimen book. It has survived not only five centuries, but also the leap into electronic typesetting, remaining essentially unchanged. It was popularised in the 1960s with the release of Letraset sheets containing Lorem Ipsum passages, and more recently with desktop publishing software like Aldus PageMaker including versions of Lorem Ipsum.

Related Posts

