మహాత్మా గాంధీ చూపిన సత్యం, శాంతి, అహింస మార్గంలో ప్రతి ఒక్కరు నడవాలి... ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పిలుపు.

సర్వోదయ చరక సంఘటన్ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజు

WhatsApp Image 2026-01-30 at 11.52.43 AM

 

వరంగల్  :  జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సర్వోదయ చరక సంఘటన్ కార్యక్రమాన్ని గాంధీజీ ఆశయాలను ప్రతిబింబించే విధంగా ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇంచార్జి  మీనాక్షి నటరాజన్* ముఖ్య అతిథిగా హాజరై, చరఖా అభ్యాస్ ప్రాముఖ్యతను వివరించారు.ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, కె.ఆర్. నాగరాజు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే  నాయిని రాజేందర్ రెడ్డి  KUDA చైర్మన్, హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ ఇనగాల వెంకటరామిరెడ్డి, వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ మహమ్మద్ ఆయూబ్ , పార్టీ శ్రేణులుతో కలిసి పాల్గొన్నారు. తొలుత మహాత్మా గాంధీ చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ నేతలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం చరఖా అభ్యాస్ కార్యక్రమంలో పాల్గొని స్వదేశీ భావజాలం, స్వావలంబన, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతంపై గాంధీజీ చేసిన కృషిని స్మరించుకున్నారు.

 

WhatsApp Image 2026-01-30 at 11.52.44 AM

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజు  మాట్లాడుతూ…

చరఖా అభ్యాస్ యొక్క చారిత్రక, సామాజిక, ఆర్థిక ప్రాముఖ్యతను స్పష్టంగా, స్ఫూర్తిదాయకంగా వివరించిన ఏఐసీసీ ఇంచార్జి మీనాక్షి నటరాజన్ గారికి వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజల పక్షాన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. గాంధీజీ బోధించిన స్వదేశీ, స్వావలంబన సిద్ధాంతాలు నేటి కాలంలో మరింత అవసరమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. తాను స్వయంగా గాంధీజీ ఆశ్రమాన్ని సందర్శించి చరఖా అభ్యాస్ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా తెలుసుకొని, గాంధీజీ ఆశయాలను ప్రజల్లో మరింత విస్తృతంగా తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని తెలిపారు. మహాత్మా గాంధీ చూపిన సత్యం, శాంతి, అహింస మార్గమే దేశాన్ని ఐక్యతతో ముందుకు నడిపించే ఏకైక దారిగా ఎమ్మెల్యే అభివర్ణించారు. ప్రస్తుత పరిస్థితుల్లో దేశంలో సామాజిక సమతా, సహనం, పరస్పర గౌరవం అవసరం మరింత పెరిగిందని, గాంధీజీ ఆలోచనలను ఆచరణలో పెట్టినప్పుడే బలమైన భారతదేశ నిర్మాణం సాధ్యమవుతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ గాంధీజీ ఆశయాలను తన విధానాల్లో, కార్యక్రమాల్లో ఎప్పటికీ ముందుండి అమలు చేస్తుందని స్పష్టం చేశారు.  ఈ కార్యక్రమం ద్వారా గాంధీజీ ఆశయాలు యువతలోకి మరింత చేరాలన్నదే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని, భవిష్యత్తు తరాలకు గాంధీజీ విలువలను అందించడం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త బాధ్యతగా ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, మహిళా కాంగ్రెస్ నాయకులు, యువజన కాంగ్రెస్, ఎన్ఎస్‌యుఐ కార్యకర్తలు, అభిమానులు ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు...

Views: 6

About The Author

Vision Andhra Telugu Daily Picture

Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry. Lorem Ipsum has been the industry's standard dummy text ever since the 1500s, when an unknown printer took a galley of type and scrambled it to make a type specimen book. It has survived not only five centuries, but also the leap into electronic typesetting, remaining essentially unchanged. It was popularised in the 1960s with the release of Letraset sheets containing Lorem Ipsum passages, and more recently with desktop publishing software like Aldus PageMaker including versions of Lorem Ipsum.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

కే డి సి సి బి బ్యాంకు సేవలు వినియోగించుకోవాలి.. ఆర్బిఐ వారోత్సవాలు భాగంగా ఆర్థిక అక్షరాస్యత అవగాహన సదస్సు.. కే డి సి సి బి బ్యాంకు సేవలు వినియోగించుకోవాలి.. ఆర్బిఐ వారోత్సవాలు భాగంగా ఆర్థిక అక్షరాస్యత అవగాహన సదస్సు..
    శంకరపట్నం  :  కేడీసీసీ బ్యాంకు సేవలను గ్రామ ప్రజలు వినియోగించుకొని, ఆర్థికంగా ఎదగాలని గ్రామ సర్పంచ్ కొయ్యడ పరుశురాములు గ్రామ ప్రజలను కోరారు. గురువారం కరీంనగర్
మిర్చి తోటలలో బాల కార్మికులు పట్టించుకోని అధికారులు.
రంజాన్ పండుగ జి.ఓ.10 కి మద్దతు
నీట్' రాసే ముస్లింలు ఈడబ్ల్యూఎస్ కోటాలో దరఖాస్తు చేసుకోండి ఎండీ. యాకూబ్ పాషా
మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కు పటిష్ట ఏర్పాట్లు... జిల్లా కలెక్టర్ అనుదీప్
ఎమ్మెల్యే పై దుష్ప్రచారం చేస్తే సహించం ఇంద్రవెల్లి కాంగ్రెస్ నాయకులు.
శివరాత్రికి సిద్ధమైన శివాలయాలు భక్తులకు అన్ని ఏర్పాట్లు చేసిన నిర్వాహకులు