ప్రతి ఒక్కరికి న్యాయం అందించడమే లక్ష్యం ప్రధాన న్యాయమూర్తి బివి నిర్మల గీతంబ

WhatsApp Image 2026-02-08 at 3.30.36 PM

 

సంగెం  :  రాజ్యాంగంలోని ప్రతి పౌరుడికి న్యాయం అందించడమే లక్ష్యమని వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.వి నిర్మలగీతంబ అన్నారు. శనివారం నర్సంపేట్ మండలం రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో వృద్ధుల సంరక్షణ కొరకు లీగల్ ఎయిడ్ క్లినిక్ ని ప్రారంభించారు. రాజుపేటలోని ప్రాథమిక ఉన్నత పాఠశాలలో, చెన్నారావుపేట్ మండలం అమీనాబాద్  గ్రామ పంచాయతీ కార్యాలయంలో, నెక్కొండ మండలం లోని అజ్మీర మంగ్య  తండ  గ్రామ పంచాయతీ కార్యాలయాలలో గ్రామీణ న్యాయ సంరక్షణ, మద్దతు కేంద్రలను వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి. వి నిర్మల  గీతాంబ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి నిర్మల గీతంబ మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి న్యాయం అందించడమే లక్ష్యమని అన్నారు. సమాజంలోని పేదలు, వెనుకబడిన వర్గాలకు అందుబాటులో ఉండే చట్టపరమైన సహాయాన్ని అందించడానికి, న్యాయం ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండాలన్న రాజ్యాంగ ఆశయాన్ని గ్రామస్థాయికి తీసుకురావడమే ఈ కేంద్రం యొక్క ముఖ్య ఉద్దేశ్యం అని తెలిపారు. భారత రాజ్యాంగం ప్రతి పౌరునికీ సమాన న్యాయం కల్పించాలనే లక్ష్యంతో ఈ క్లినిక్ రూపొందించబడింది అని పేర్కొన్నారు. చాలా సార్లు పేదలు, మహిళలు, వృద్ధులు, వికలాంగులు, కార్మికులు, ఎస్సీ, ఎస్టీ వర్గాల వారు న్యాయ వ్యవస్థకు దూరంగా ఉండిపోతున్నారు. ఈ పరిస్థితిని మార్చడానికే జాతీయ న్యాయ సేవాధికార సంస్థ నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ దేశవ్యాప్తంగా అనేక ప్రజాహిత కార్యక్రమాలను అమలు చేస్తోంది అని తెలిపారు. ప్రజలతో న్యాయ వ్యవస్థ నేరుగా మాట్లాడటం, కోర్టులు ప్రజల వద్దకు రావడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని అన్నారు. న్యాయంపై ఉన్న భయం, అపోహలు తొలగించి, ప్రజలకు వారి హక్కులు, బాధ్యతలు తెలియజేయడమే న్యాయ సేవాధికార సంస్థల యొక్క లక్ష్యం అని తెలిపారు .ఈ గ్రామ న్యాయ సంరక్షణ మరియు మద్దతు కేంద్రం ద్వారా ఉచిత న్యాయ సహాయం గురించి, కుటుంబ, భూ, కార్మిక, గృహ హింస, మహిళలు మరియు పిల్లల హక్కులపై మార్గదర్శకత్వం, లోక్ అదాలత్‌లు, మధ్యవర్తిత్వం వంటి సులభ పరిష్కార మార్గాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై న్యాయ అవగాహన గ్రామస్థాయిలోనే అందించబడతాయి అని వివరించారు. ఈ కేంద్రం ద్వారా చిన్న సమస్యలు పెద్ద వివాదాలుగా మారకుండా ముందే పరిష్కారం పొందే అవకాశం లభిస్తుంది.
కావున ప్రజలు, ఈ కేంద్రాన్ని పూర్తిగా వినియోగించుకోవాలని, తమ సమస్యలను భయపడకుండా తెలియజేయాలని సూచించారు. లీగల్ ఎయిడ్ క్లినిక్ లను నిర్వహించే పారా లీగల్ వాలంటీర్లు ప్రతి శనివారం ప్రజలకు న్యాయ సేవలను అందిస్తారని, న్యాయ సలహా, నోటీసులు, ప్రత్యుత్తరాలు దరఖాస్తులు పిటీషన్ లను రూపొందించడంలో సహాయం చేస్తారని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి యం. .సాయికుమార్, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి నర్సంపేట పి.గిరిధర్, న్యాయవాదులు టి సునీత, డి సాంబయ్య ఆయా గ్రామాల మండల రెవెన్యూ అధికారులు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, సర్పంచులు, అధికారులు పారా లీగల్ వాలంటీర్ భాషిపాక రాములు, డి.కరుణాకర్, బి.స్వప్న, కె.హరీష్, ఆయా గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

 

WhatsApp Image 2026-02-08 at 3.30.36 PM(1)

Views: 4

About The Author

Vision Andhra Telugu Daily Picture

Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry. Lorem Ipsum has been the industry's standard dummy text ever since the 1500s, when an unknown printer took a galley of type and scrambled it to make a type specimen book. It has survived not only five centuries, but also the leap into electronic typesetting, remaining essentially unchanged. It was popularised in the 1960s with the release of Letraset sheets containing Lorem Ipsum passages, and more recently with desktop publishing software like Aldus PageMaker including versions of Lorem Ipsum.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

బిఆర్ఎస్ కార్పొరేట్ అభ్యర్థులకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీకి బుద్ది చెప్పండి   -- మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ బిఆర్ఎస్ కార్పొరేట్ అభ్యర్థులకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీకి బుద్ది చెప్పండి -- మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్
    మహబూబ్ నగర్  : మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థులకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఓటర్లను
అభివృద్ధి కావాలంటే కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు గెలవాలి --- ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
23 వ వార్డులో విస్తృత ప్రచారం నిర్వహించిన స్వతంత్ర అభ్యర్థి మేస్త్రం వామన్
కాంగ్రెస్ తోనే ములుగు అభివృద్ధి....అన్ని వార్డుల్లో కౌన్సిలర్లను గెలిపించాలి ..... అభివృద్ధి చేసే బాధ్యత నాది మంత్రి సీతక్క.
కాంగ్రెస్ లో చేరిన కుడియా తండా బిఆర్ఎస్ నాయకులు
బిజెపి నాయకుల అక్రమ అరెస్టు
అయిజ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీలో పాల్గొన్న ఎంపీ మల్లు రవి,ఏఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్