సర్పంచుల సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక
చిన్నంబావి,: వనపర్తి జిల్లా చిన్నంబావి మండల ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశం అనంతరం మండల గ్రామ సర్పంచుల సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ ఎన్నికల్లో సంఘం అధ్యక్షుడిగా వెలుగొండ సర్పంచ్ శరత్ రెడ్డి, గౌరవ అధ్యక్షులుగా వెంకట్ రెడ్డి, కమలా బాయి, ఉపాధ్యక్షులుగా నర్సింహ్మ, లీలవతి, ప్రధాన కార్యదర్శిగా పద్మావతి, కోశాధికారిగా శంకర్ తో పాటు కార్యవర్గ సభ్యురాలిగా దివ్యశ్రీలు బాధ్యతలు స్వీకరించారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి, మండల సమగ్ర అభివృద్ధికి సర్పంచులందరినీ ఏకతాటిపైకి తెస్తూ నిరంతరం కృషి చేస్తామని నూతనంగా ఎన్నికైన ప్రతినిధులు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అనంతరం నూతన కమిటీ సభ్యులను పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు పూలమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
Views: 1
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
04 Aug 2026 18:44:58
మందమర్రి, (మంచిర్యాల) : జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు,ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలలో వేగం పెంచి అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ ఫలాలు అందేలా సమన్వయంతో కృషి చేయాలని...
