ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణకు వ్యతిరేకంగా శాంతియుత పోరాటం కొనసాగిస్తాం
నాగర్ కర్నూల్ : ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా శాంతియుత పోరాటం కొనసాగిస్తామని జాతీయ పర్ మాల మహానాడు అండ్ రాక్స్ అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని హిమాలయ హోటల్ హాల్ లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ఎస్సీ వర్గీకరణ వల్ల మాల సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతోందని ఆరోపిస్తూ, దీనికి వ్యతిరేకంగా పార్లమెంట్‌లో చట్టపరమైన మార్పులు జరిగే వరకు శాంతియుత పోరాటాన్ని కొనసాగిస్తామని మాల సంఘాల నాయకులు తెలిపారు. ఎస్సీ వర్గీకరణకు బీజం కాంగ్రెస్ పార్టీ పాలిత రాష్ట్రాల్లో పడిందని, అనంతరం దేశవ్యాప్తంగా అమలుకు కేంద్ర ప్రభుత్వం అవకాశం కల్పించిందని విమర్శించారు. ఎస్సీ రిజర్వేషన్ల అమలు, సామాజిక న్యాయం, రాజకీయ ప్రాతినిధ్యం వంటి అంశాలపై ప్రభుత్వాలు సమగ్ర దృష్టి సారించాలని కోరారు. దళితుల ఐక్యతను దెబ్బతీసే విధంగా వర్గీకరణ అమలవుతోం దని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన నాయకులు, రిజర్వేషన్లతో పాటు ప్రభుత్వాల్లో మంత్రి పదవులు, ఇతర అవకాశాల పంపిణీలో కూడా సామాజిక న్యాయం పాటించాలని డిమాండ్ చేశారు. ప్రజల సంకల్పం ఉంటే చట్టాలను కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో మార్చుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో మాల సామాజిక వర్గానికి చెందిన ప్రజా ప్రతినిధులు ఈ అంశంపై గట్టిగా స్పందించాలని, సమాజ ప్రయోజనాల కోసం ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మాల సామాజిక వర్గం శాంతియుత ఉద్యమానికి సిద్ధం కావాలని కోరారు. ప్రజల ప్రభుత్వం అని చెప్పుకునే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో మాలలను నమ్మించి గొంతు కోసినట్లూ చేస్తుంది ఆయన ఆవేదనకు వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తైలి శ్రీనివాస్, బీరం సతీష్ కుమార్, కూన సుధాకర్, నూనె క్రాంతి కుమార్, డా. చెన్నయ్య, డా. శంకరయ్య, కె. గిరీష్, బి. బసవరాజ్ తదితరులు పాల్గొన్నారు.
Views: 8
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
04 Aug 2026 18:44:58
మందమర్రి, (మంచిర్యాల) : జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు,ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలలో వేగం పెంచి అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ ఫలాలు అందేలా సమన్వయంతో కృషి చేయాలని...
