చౌటకూర్ మండల ఉప సర్పంచ్ ఫోరం రద్దు.. త్వరలో కొత్త కమిటీ ఏర్పాటు
చౌటకూర్ :సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండల ఉప సర్పంచ్ ఫోరం అధ్యక్షుడి ఎంపికపై నిన్న జరిగిన సమావేశంలో పార్టీ నిర్ణయం తీసుకున్నప్పటికీ, అనంతరం ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మండలంలోని ఉప సర్పంచ్‌లు సోమవారం సమావేశమై, నిన్న ఏర్పాటు చేసిన ఉప సర్పంచ్ ఫోరాన్ని రద్దు చేస్తూ ఏకగ్రీవంగా తీర్మానం చేశారు.ఈ సందర్భంగా ఉప సర్పంచ్‌లు మాట్లాడుతూ అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని, రోజుల్లో మరో సమావేశం నిర్వహించి కొత్త ఫోరం కమిటీని ఏర్పాటు చేస్తామని తెలిపారు. మండలంలోని అన్ని గ్రామాల ఉప సర్పంచ్‌ల సమన్వయంతో పారదర్శకంగా కొత్త కమిటీని ఎన్నుకుం టామని వెల్లడించారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


