ఎరువుల విక్రయ ఫ్రేమవర్క్ పై రైతులకు అవగాహన కార్యక్రమం
మర్కుక్ : సిద్ధిపేట జిల్లా మర్కుక్ రైతు వేదికలో ఎరువుల డీలర్లకు వ్యవసాయ శాఖ డైరెక్టర్ కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ వెబేక్ష్ ద్వారా ఎఫ్ ఎఫ్ ఎస్ (ఫ్రేమ్ వర్క్ ఫార్టిలైజార్ ఫర్ సేల్ ) యాప్ వినియోగంపై సోమవారం నాడు రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి బోయినపల్లి రాము మాట్లాడుతూ ఆగస్టు 6వ తేదీ నుండి మర్కుక్ మండలంలో ఎఫ్ ఎఫ్ ఎస్ ఫ్రేమవర్క్ ఫర్టిలైజర్ యాప్ అమలులోకి రానుందని తెలిపారు.అన్ని ఎరువుల డీలర్లు తప్పనిసరిగా ఈ యాప్ ద్వారా మాత్రమే ఎరువుల విక్రయాలు నిర్వహించాలని సూచించారు.యాప్ వినియోగ విధానం,రైతుల వివరాల నమోదు,ఎరువుల విక్రయ ప్రక్రియ,నిబంధనలపై డీలర్లకు సమగ్ర అవగాహన కల్పించబడింది.ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ విస్తరణ అధికారులు,మర్కుక్ మండలంలోని ఎరువుల డీలర్లు పాల్గొన్నారు.
Views: 22
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
04 Aug 2026 18:44:58
మందమర్రి, (మంచిర్యాల) : జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు,ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలలో వేగం పెంచి అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ ఫలాలు అందేలా సమన్వయంతో కృషి చేయాలని...
