ఉపాధి కాపాడాలి.. ఫ్యాక్టరీ ఉత్పత్తులు పునరుద్ధరించాలి

ఉపాధి కాపాడాలి.. ఫ్యాక్టరీ ఉత్పత్తులు పునరుద్ధరించాలి

శివంపేట బీర్ ఫ్యాక్టరీ కార్మికుల సమస్యలపై జిల్లా కలెక్టర్‌కు సీఐటీయు వినతిపత్రం

చౌటకూర్ : చౌటకూర్ మండలం శివంపేట మండలంలోని బీర్ ఫ్యాక్టరీలో గత వారం రోజులుగా ఉత్పత్తులు నిలిచిపోవడంతో వందలాది మంది కాంట్రాక్ట్ కార్మికులు ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని పేర్కొంటూ, కార్మికుల జీవనోపాధిని పరిరక్షించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం ఇవ్వడం జరిగింది.కంపెనీపై వచ్చిన కాలుష్య ఆరోపణలపై సంబంధిత అధికారులు నిష్పక్షపాతంగా విచారణ చేపట్టి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నివేదికను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.కాలుష్యం జరిగినట్లు శాస్త్రీయంగా నిరూపితమైతే చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని, కానీ వాస్తవాలు తేలకముందే పరిశ్రమ ఉత్పత్తులను నిలిపివేయడం వల్ల వందలాది మంది కార్మికులు, వారి కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు. కార్మికుల ఉపాధికి ఎలాంటి భంగం కలగకుండా ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. కాంట్రాక్ట్ కార్మికులకు రెగ్యులర్ డ్యూటీలు, ఉద్యోగ భద్రత, తగిన పని దినాలు కల్పించాలని, పరిశ్రమను పూర్తి స్థాయిలో తిరిగి ప్రారంభించేలా ప్రభుత్వం, కంపెనీ యాజమాన్యం చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. శివంపేట ప్రాంత ప్రజల ఉపాధికి ఈ పరిశ్రమ కీలకమని, పర్యావరణ పరిరక్షణతో పాటు కార్మికుల జీవనోపాధికి కూడా సమాన న్యాయం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు బీరం మల్లేశం, ఉపాధ్యక్షులు పి బాగారెడ్డి, నాయకులు, ప్రసన్న రావు, సురేష్, మల్లారెడ్డి, లక్ష్మారెడ్డి చంద్రయ్య శీను యశోద సుమిత్ర రాములు విట్టల్ మరియు కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొన్నారు.
Views: 2

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో వేగం పెంచాలి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో వేగం పెంచాలి
మందమర్రి, (మంచిర్యాల) : జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు,ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలలో వేగం పెంచి అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ ఫలాలు అందేలా సమన్వయంతో కృషి చేయాలని...
మూడు నెలల రేషన్ కోటాను సజావుగా పంపిణీ చేయాలి
తాండూర్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ నూతన కమిటీ సభ్యులకు సన్మానం.
నాన్యమైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం
చక్రియాల్‌లో హరితహారం వన మహోత్సవం ఘనంగా నిర్వహణ
తాండూరు బీఆర్ఎస్ పార్టీ ఇన్‌చార్జ్  శ్రీశైల్ రెడ్డి .
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాండూరు గడ్డపై టిఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయం.