సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో చట్టాలపై అవగాహన కార్యక్రమం
కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ ప్రాంగణంలో హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వినియోగదారులకు చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ బొడ్డుపాటి దాసు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కాల్వ సుధాకర్ రావు, సబ్ రిజిస్ట్రార్ అప్పారావు, జిల్లా అధ్యక్షుడు మాలోత్ రాందాస్ నాయక్ మాట్లాడుతూ రిజిస్ట్రేషన్ చట్టాలు, మానవ హక్కులు, వినియోగదారుల హక్కులు, మహిళల హక్కుల పరిరక్షణపై అవగాహన కల్పించారు.కార్యక్రమంలో జిల్లా సలహా బోర్డు అధ్యక్షుడు ఎస్.కె. అబ్బాస్, జిల్లా సభ్యురాలు విజయలక్ష్మి, జిల్లా ఇన్‌చార్జి గడ్డం శామ్యూల్‌తో పాటు పలువురు సభ్యులు పాల్గొన్నారు.అనంతరం హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ ప్రతినిధులు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు, ఐపీఎస్, డీఎస్పీ ఆధినారాయణను మర్యాదపూర్వకంగా కలిసి ఆగస్టు 4న నిర్వహించనున్న చట్టాలపై అవగాహన సదస్సుకు ఆహ్వానించారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ, డీఎస్పీ హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ చేపడుతున్న సేవలను, సంస్థ సభ్యుల సేవాభావాన్ని అభినందించారు.
Views: 14
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
21 Jul 2026 18:14:10
హైదరాబాద్: భారత్-యూకే సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం(సీఈటీఏ) అమలులోకి వచ్చిన సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో తెలంగాణ నుంచి యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే)కు వెళ్లే ఎగుమతి కంటైనర్లను అధికారికంగా...
