ఎల్‌నినో ప్రభావంపై అవగాహన

 ఎల్‌నినో ప్రభావంపై అవగాహన

సిద్ధిపేట / మర్కుక్ :  సిద్ధిపేట జిల్లా మర్కుక్ మండల పరిధిలోని నర్సన్నపేట గ్రామంలో రైతుల అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్బంగా మండల వ్యవసాయ అధికారి బోయినపల్లి రాము మాట్లాడుతూ ఈ వానాకాలంలో ఎల్‌నినో ప్రభావం కారణంగా సాధారణం కంటే వర్షపాతం తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని రైతులకు తెలిపారు.ఈ పరిస్థితుల్లో అధిక నీటి అవసరమున్న వరి పంట సాగును తగ్గించి,తక్కువ నీటితో సాగు చేయగల ఆరుతడి పంటలైన పత్తి,కంది,పెసర,మినుము,జొన్న,సజ్జ,మొక్కజొన్న వంటి పంటలను సాగు చేయాలని రైతులకు సూచించారు.అలాగే అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వినియోగిస్తూ,నేల తేమను కాపాడే యాజమాన్య పద్ధతులను పాటించాలన్నారు.వ్యవసాయ శాఖ సూచించిన పంటలనే సాగు చేసి నష్టాలను తగ్గించుకోవాలని రైతులకు వివరించారు.రైతులు వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ,వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు పాటించాలని,అవసరమైన సాంకేతిక సలహాల కోసం తమ పరిధిలోని వ్యవసాయ విస్తరణ అధికారులను సంప్రదించాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గిల్క బాల నర్సయ్య,టెక్నికల్ అసిస్టెంట్ రాజు,పంచాయతీ కార్యదర్శి సతీష్ కుమార్,వార్డు సభ్యులు,గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.
 
Views: 1

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

హైదరాబాద్ నుంచి తెలంగాణ ఎగుమతుల కంటైనర్లు ప్రారంభం హైదరాబాద్ నుంచి తెలంగాణ ఎగుమతుల కంటైనర్లు ప్రారంభం
హైదరాబాద్‌: భారత్-యూకే సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం(సీఈటీఏ) అమలులోకి వచ్చిన సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో తెలంగాణ నుంచి యునైటెడ్ కింగ్‌డమ్‌ (యూకే)కు వెళ్లే ఎగుమతి కంటైనర్లను అధికారికంగా...
కోట మైసమ్మ ఆలయంలో బహిరంగ వేలం
సింగరేణిలో మెగా వృక్షారోపణ కార్యక్రమం
‘హ్యాండ్లూమ్ హ్యాకథాన్ 2026’ ప్రారంభం
ఇల్లందు–బొమ్మనపల్లి మార్గంలో ట్రాఫిక్ డైవర్షన్ ఎత్తివేత
ఆనెగుంట సర్పంచ్‌కు డీపీఓ షోకాజ్ నోటీసులు
ఏకలవ్య పాఠశాలలో ఆరోగ్య శిబిరం