భీమ్లా తండాలో వైభవంగా సీత్ల పండుగ
సంస్కృతిని చాటిన గిరిజన పండుగ
పశుసంపద రక్షణే ధ్యేయం.. ఏడుగురు దేవతలకు ప్రత్యేక పూజలు..
ప్రకృతి ఆరాధనతో పులకించిన భీమ్లా తండా
మర్రిగూడ, నల్లగొండ :మర్రిగూడ మండలం కమ్మగూడ గ్రామ పంచాయతీ పరిధిలోని భీమ్లా తండాలో గిరిజనుల అత్యంత పవిత్రమైన పండుగ సీత్ల అత్యంత భక్తిశ్రద్ధలతో, వైభవంగా జరిగింది.తండాలోని ప్రజలతో పాటు పశుపక్షాదులు కూడా రోగాల బారిన పడకుండా చల్లగా ఉండాలని గిరిజన సాంప్రదాయం ప్రకారం ఈ వేడుకను నిర్వహించారు.ఉదయాన్నే తండాలోని మహిళలు గిరిజన సాంప్రదాయ దుస్తులు ధరించి బోనాలతో తరలివచ్చారు. ప్రత్యేకంగా తయారు చేసిన గుగ్గిళ్లు, నైవేద్యాలను సమర్పించి తండా బొడ్డురాయి గ్రామ దేవత వద్ద పూజలు నిర్వహించారు. కొబ్బరికాయలు కొట్టి, యాటలను కోసి మొక్కులు తీర్చుకున్నారు. గిరిజన సంస్కృతిలో ప్రకృతికి, పశువులకు ఇచ్చే ప్రాధాన్యతకు ఈ 'సీత్ల' పండుగ నిదర్శనం.వర్షాకాలం ప్రారంభంలో పశువులకు ఎలాంటి వ్యాధులు గాలికుంటు వంటి రోగాలుసోకకుండా, గ్రామం సుభిక్షంగా ఉండాలని గ్రామస్తులు కోరారు.ఏడుగురు దేవతలను సప్తమాతృకలు అత్యంత భక్తితో కొలిచారు.సతీ భవానీ,సీత్ల భవానీ,మేరమ్మ భవానీ,దవళాగర్ భవానీ,చాంపాళగర్ భవానీ,రేణుకా భవానీ ,మంత్రాల భవానీ ఈ ఏడుగురు దేవతల ఆశీస్సులు ఉంటే తండాపై ఎలాంటి ఈతిబాధలు, కరువు కాటకాలు రావని భీమ్లా తండా వాసులు అన్నారు. దేవతల ప్రతిరూపాలుగా భావించే రాళ్లకు పాలు, పెరుగుతో అభిషేకాలు చేసి, మేకపోతులను బలి ఇచ్చి మొక్కులు చెల్లించుకున్నారు.ఈ సంప్రదాయ వేడుకల్లో యువతీ యువకులు గిరిజన నృత్యాలు సాంప్రదాయ గీతాలతో ఉత్సాహంగా పాల్గొన్నారు. లంబాడీల విలక్షణమైన సంస్కృతిని ప్రతిబింబించేలా సాగిన ఈ నృత్యాలు తండాలో పండుగ వాతావరణాన్ని రెట్టింపు చేశాయి. ప్రకృతిని కాపాడుకుంటూ, ఇలాంటి ప్రాచీన సంస్కృతులను సజీవంగా ఉంచాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని ఈ సందర్భంగా పలువురు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కమ్మగూడ సర్పంచ్ విజయ లక్ష్మణ్ నాయక్, మాజీ ఎంపీటీసీ ఆంబోత్ కిషన్ నాయక్, వార్డు సభ్యులు రామావత్ విజయ్, రామావత్ బిక్షం, మాజీ వార్డు సభ్యులు శ్రీను, రామావత్ రమేష్, రామావత్ సురేందర్, రామావత్ నాగరాజు, రామావత్ గణేష్, రామావత్ రెడ్డి, వడ్త్యా నవీన్, ఆంబోత్ విజయ్, రామావత్ రాజు, రామావత్ నరేష్, నరేందర్, అశోక్, సునీల్, శ్రీధర్, రాంచరణ్, మహేష్, కిట్టు, సోను, వంశీ తదితర తండా పెద్దలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Views: 345
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
04 Aug 2026 18:44:58
మందమర్రి, (మంచిర్యాల) : జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు,ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలలో వేగం పెంచి అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ ఫలాలు అందేలా సమన్వయంతో కృషి చేయాలని...
